రైల్వేశాఖ అద్భుత ఆవిష్కరణ.. రైలు ఇంజన్లలో ఏఐ టెక్నాలజీ..

by Sumithra |   ( Updated:2024-01-20 12:13:22.0  )
రైల్వేశాఖ అద్భుత ఆవిష్కరణ.. రైలు ఇంజన్లలో ఏఐ టెక్నాలజీ..
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుత యుగంలో వినియోగించే సాంకేతికతలలో ఒకటి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భారతీయ రైల్వే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైలు ప్రయాణాన్ని సురక్షిత మార్గంలో పెట్టే పనిలో ఉంది. రైల్వే ఇంజిన్‌ల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పరికరం అమర్చనున్నారు. ఈ పరికరం పేరు ‘రైల్వే లోకో పైలట్ హెల్ప్ డివైస్’. ఈ పరికరం లోకో పైలట్, సహాయకుడి ప్రతిపని పై నిఘా ఉంచుతుందని చెబుతున్నారు రైల్వే శాఖ అధికారులు. ఈ AI పరికరంలోని అంతర్నిర్మిత వాయిస్ కమాండ్ లోకో పైలట్‌కు హెచ్చరికలను జారీచేస్తుంది. రైలు ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ కొత్త సాంకేతికత పై కసరత్తు చేస్తోంది.

మీడియా నివేదికల ప్రకారం డ్రైవర్ రెప్పపాటులో చేసే తప్పులను కూడా AI పరికరం కనిపెట్టి హెచ్చరికను జారీ చేస్తుంది. అంతేకాదు లోకో పైలట్ లేదా సహాయకుడు సిగరెట్ తాగితే AI పరికరం పొగను కూడా గుర్తిస్తుంది. భారతీయ రైల్వే డ్రైవర్ సహాయ వ్యవస్థ (RDAS)ని రైలు ఇంజిన్‌లో అమర్చిన విజిలెన్స్ కంట్రోల్ పరికరం (VCD)తో అనుసంధానించనున్నారు. ఈ వ్యవస్థ మొదటి సారి ఇంజిన్లలో ఇన్స్టాల్ చేస్తున్నారు.

అలాగే లోకో పైలట్, అసిస్టెంట్ వారి మొబైల్‌లో మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కమాండ్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. లోకోపైలట్ ఫోన్‌లో మాట్లాడితే ఈ పరికరం వారిని అప్రమత్తం చేసి ఫోన్‌ని పెట్టమని చెబుతుంది. అంతేకాదు పరికరంలో సేవ్ చేసిన నంబర్‌కు వారి రికార్డింగ్ పంపబడుతుందని హెచ్చరిస్తుంది.

ఇంజన్‌ను నడుపుతున్నప్పుడు లోకో పైలట్ దిక్కులు చూసినప్పుడు AI పరికరం గుర్తిస్తుంది. వాయిస్ కమాండ్ ప్రోగ్రామ్ మీ చూపును ముందు వైపు ఉంచమని హెచ్చరిస్తుంది. అంతే కాదు లోకో పైలట్ చిన్న పొరపాటు చేసినా అది కూడా నమోదవుతుంది. ఇంజన్ లోపల మానవ తప్పిదాలను నివారించడంలో AI పరికరం ముఖ్యమైన పాత్ర పోషించనుంది.

Advertisement

Next Story