108 ఎంపీ కెమెరాతో పోకో ఎక్స్6 నియో స్మార్ట్‌ఫోన్ విడుదల

by S Gopi |
108 ఎంపీ కెమెరాతో పోకో ఎక్స్6 నియో స్మార్ట్‌ఫోన్ విడుదల
X

దిశ, టెక్నాలజీ: స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ పోకో తన ఎక్స్ సిరీస్‌లో మరొక మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికీ ఈ సిరీస్‌లో పోకో ఎక్స్6, పోకో ఎక్స్ 6 ప్రోను తీసుకురాగా, తాజాగా నియో పేరుతో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. రెండు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఫోన్ 8జీబీ, 128 జీబీ ధర రూ. 15,999గా నిర్ణయించారు. 12 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ. 17,999గా ఉంటుందని కంపెనీ తెలిపింది. బుధవారం(మార్చి 13) సాయంత్రం నుంచే అమ్మకాలు ప్రారంభమవుతాయని, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఫీచర్లకు సంబంధించి.. సరికొత్తగా వచ్చిన ఎక్స్6 నియో 5జీ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్‌డ్ డిస్‌ప్లేతో 120 రీఫ్రెష్ రేటుతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 108 ఎంపీ మెయిన్ కెమెరాతో 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story