Deadpool: డెడ్‌పూల్ సినిమా లోగోతో Poco కొత్త మోడల్.. ధర, ఫీచర్స్ ఇవే

by Harish |
Deadpool: డెడ్‌పూల్ సినిమా లోగోతో Poco కొత్త మోడల్.. ధర, ఫీచర్స్ ఇవే
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Poco ఇండియాలో డెడ్‌పూల్ సినిమా ఆధారంగా ప్రత్యేకమైన డిజైన్‌‌తో రూపొందించిన కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Poco F6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్’. ఫోన్ బ్యాక్‌సైడ్ మార్వెల్ సూపర్ హీరో ఐకానిక్ రెడ్, బ్లాక్ కలర్ స్కీమ్‌ను అమర్చారు. కెమెరా చుట్టూ డెడ్‌పూల్ లోగోను అందించారు. దీని 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999. ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ క్రింద రూ. 4,000 తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ. 29,999 కే కొనుగోలు చేయవచ్చు. ఇది ఆగస్టు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్‌లు

* 6.67-అంగుళాల 1.5K (1,220x2,712 పిక్సెల్‌లు) రిజల్యూషన్

* AMOLED డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌

* Android 14-ఆధారిత హైపర్‌ ఓఎస్‌తో రన్ అవుతుంది.

* స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 SoC ద్వారా పనిచేస్తుంది.

* బ్యాక్ సైడ్ 50MP+8MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 20MP కెమెరా ఉంది.

* 90W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు.



Next Story