రూ. 20 వేలకే OnePlus 5G స్మార్ట్ ఫోన్

by Harish |
రూ. 20 వేలకే OnePlus 5G స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: OnePlus కంపెనీ నుంచి ‘Nord CE 3 Lite 5G’ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 19,999. 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 21,999. ఏప్రిల్ 11 నుండి వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా, ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో ICICI బ్యాంక్ కార్డులపై రూ. 1,000 తక్షణ తగ్గింపు కూడా ఉంటుంది.


OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్‌లు

* 6.72-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లే.

* 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌.

* ఆండ్రాయిడ్ 13 పై ఆక్సిజన్ OS 13.1తో రన్ అవుతుంది.

* ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా పనిచేస్తుంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 108MP+2MP+2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు 16MP కెమెరా ఉంది.

* 67W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

Advertisement

Next Story