- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘నథింగ్ ఫోన్ 2’ లాంచ్ కన్‌ఫర్మ్

X
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ నుంచి కొత్తగా ‘నథింగ్ ఫోన్ 2’ ప్రపంచవ్యాప్తంగా జులైలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని నథింగ్ సహ వ్యవస్థాపకుడు, CEO కార్ల్ పే ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించారు. గతంలో వచ్చిన నథింగ్ ఫోన్ 1 లో 4,500mAh బ్యాటరీ ఉండగా, ఇప్పుడు రాబోతున్న నథింగ్ ఫోన్ 2లో 4,700mAh బ్యాటరీ ఉండనుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్‌ను అందించారు. గత ఏడాది జులైలో నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ భారత్‌తో పాటు పలు దేశాల్లో లాంచ్ చేసింది. దీనిలో మిడ్ రేంజ్ ఆక్టా కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌ను అందించారు. రాబోయే కొత్త మోడల్ మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్‌తో వస్తుందని ఇది వినియోగదారులకు బాగా నచ్చుతుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO కార్ల్ పే తెలిపారు.
Next Story