Noise కంపెనీ నుంచి కొత్తగా ‘ColorFit Mighty’ స్మార్ట్‌వాచ్ విడుదల

by Harish |
Noise కంపెనీ నుంచి కొత్తగా ‘ColorFit Mighty’ స్మార్ట్‌వాచ్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ వాచ్ కంపెనీ నాయిస్ కొత్తగా ఒక మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘ కలర్ ఫిట్ మైటీ (ColorFit Mighty)’. ఇది ప్రత్యేకంగా 300 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ.1,999. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వాచ్ 240 x 286 పిక్సెల్‌ల రిజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 1.96-అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ధరించడానికి అనువుగా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. దీంతో నేరుగా వాచ్ ద్వారా కాల్స్ ఆన్సర్ చేయవచ్చు.



హెల్త్ ట్రాకింగ్ కోసం హార్ట్ రేట్ మానిటర్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఒత్తిడిని, శ్వాసను ట్రాక్ చేయగలదు. ఇంకా నోటిఫికేషన్‌లు, వాతావరణ అప్‌డేట్‌లు, కెమెరా, మ్యూజిక్ కంట్రోల్, DND మోడ్, మణికట్టు వేక్-అప్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఒక్కచార్జింగ్‌పై ఇది 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ధుమ్ము, నీటి నిరోధకత కోసం IP67 రేటింగ్‌ చేయబడింది.

Next Story

Most Viewed