అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త iOS 16.4 : ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలా అంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-28 06:15:48.0  )
అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త iOS 16.4 : ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలా అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఫోన్ యూజర్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. యాపిల్ ఫైనల్‌గా తన ఐఓఎస్ 16.4‌ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఐఓఎస్ 16.3.1 అందుబాటులో ఉండగా తాజాగా 1.8జీబీ సైజ్ లో 16.4 వెర్షన్ ను విడుదల చేసింది. అయితే మీరు ఇప్పటికీ ఐఓఎస్ 16 వెర్షన్ లో ఉంటే కొత్త వెర్షన్ కోసం 5 జీబీ వరకు ఉండవచ్చు.

వినియోగదారులు తమ వై ఫై నెట్ వర్క్ ద్వార ఈ అప్ డేట్ లను ఇన్ స్టాల్ చేయవచ్చు. లేదా 5జీ నెట్ వర్క్ ని వినియోగించి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయవచ్చని యాపిల్ తెలిపింది. ఈ తాజా ఐఓఎస్ కొన్ని బగ్ లకు పరిష్కారం చూపనుంది. అంతేకాకుండా 21 కొత్త ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. మీ పాత iphone 14, iphone 14 plus, iphone 14 pro, i phone 14 pro max లో క్రాష్ లను గుర్తించి మరింత ఆప్టిమైజ్ చేయడానికి ఈ కొత్త ఐఓఎస్ ఉపయోగపడనుంది.

iOS 16.4 డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేయడానికి settings>general>software update ఆప్షన్ లోకి వెళ్లి ఆటోమెటిక్ అప్ డేట్ లను ప్రారంభించాల్సి ఉంటుంది. ఆపై, మీ ఐ ఫోన్ ని iOS 16.4 కి అప్ డేట్ చేయడానికి "Install Now" పై క్లిక్ చేయాలి. మీ iphone ని త్వరగా డౌన్ లోడ్ చేయడానికి Wi - Fi నెట్ వర్క్ లేదా 5G నెట్ వర్క్‌కి కనెక్ట్ చేయబడిందని నిర్దారించుకోవాలి. అలాగే, సాఫ్ట్ వేర్ అప్ డేట్ ప్రక్రియను ప్రారంభించే ముందు iphone కనీసం 50 శాతం బ్యాటరీని కలిగి ఉందా లేదా చూసుకోవాలి.

ios 16.4 అప్ డేట్ లో కొత్తగా ఏముంది?

ఇది పాత iOS 16ను మరింత స్థిరీకరించడానికి విడుదల చేయబడిన అప్ డేటెడ్ వెర్షన్. ఈ అప్ డేట్ జంతువులు, చేతి సంకేతాలు, వస్తువుల వంటి 21 కొత్త ఎమోజీలను ఇంట్రడ్యూస్ చేస్తోంది. వీటిని ఎమోజీ కీ బోర్డ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అదేవిధంగా, అప్ డేట్ వినియోగదారులను సులభంగా యాక్సెస్ చేయడానికి హోమ్ స్క్రీన్‌కు వెబ్ యాప్ నోటిఫికేషన్‌లను జోడించడానికి అనుమతిస్తుంది.

iOS 16.4 వాయిస్ ఐసోలేషన్‌ను పరిచయం చేయడం ద్వారా వాయిస్ కాల్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఇది కస్టమర్ల వాయిస్‌కు ప్రియారిటీ ఇవ్వడంతో పాటు బాహ్య శబ్దాన్ని కంట్రోల్ చేస్తుంది. తాజా అప్‌డేట్‌తో iphone ఇప్పుడు icloud షేర్ చేసిన ఫోటో లైబ్రరీలో నకిలీ ఫోటోలు, వీడియోలను గుర్తిస్తుంది. అదనంగా వాతావారణ యాప్‌ ద్వారా మ్యాప్‌లకు వాయిస్ ఓవర్ సపోర్ట్‌ను కలిగి ఉంది. యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌ల ద్వారా ఫ్లాష్ లేదా లైట్ గుర్తించినప్పుడు యాపిల్ ఆటోమెటిక్ గా వీడయోను డిమ్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed