ChatGPT: చాట్‌జీపీటీపై అంబానీ కీలక వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

by Vennela |
ChatGPT: చాట్‌జీపీటీపై అంబానీ కీలక వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ChatGPT: పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI)ను తెలివిగా ఉపయోగించుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) సూచించారు. AIని ఉపయోగించండి, అయితే మీ స్వంత తెలివితేటలతో ముందుకు సాగండి అంటూ వారికి సూచించారు. ఈ శతాబ్ది చివరి నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అవతరిస్తుందని అంబానీ జోస్యం చెప్పారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మీరు తప్పనిసరిగా చాట్‌జిపిటిని ఉపయోగించాలని, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కాకుండా తమ స్వంత తెలివితేటలతో ముందుకు సాగాలనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ విద్యార్థులకు సూచించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

విద్యార్థులతో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, 'నేను యువ విద్యార్థులకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సాధనంగా ఉపయోగించడంలో నైపుణ్యం ఉండాలి. కానీ, మీ తెలివితేటలను ఉపయోగించడం మానేయకండి. మీరు ఈ యూనివర్సిటీని విడిచిపెట్టిన వెంటనే, మీరు ఇంకా పెద్ద 'యూనివర్సిటీ ఆఫ్ లైఫ్'లో అడ్మిషన్ తీసుకోవాలి. అక్కడ క్యాంపస్, తరగతి గదులు, బోధించడానికి ఉపాధ్యాయులు ఉండరు. మీరు మీ స్వంతంగా మాత్రమే జీవితంలో ముందుకు సాగగలరు అంటూ చెప్పుకొచ్చారు.

చైనా కొత్త ఏఐ మోడల్ డీప్‌సీక్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన తరుణంలో ముఖేష్ అంబానీ ఏఐపై మాట్లాడారు. ఇది ముఖ్యంగా ఎన్విడియా వంటి ప్రముఖ అమెరికన్ కంపెనీలలో భయాందోళనలను సృష్టించింది. దీని కారణంగా AIలో అమెరికా ఆధిపత్యానికి సవాలు ఎదురైంది.

ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడుతూ ముఖేష్ అంబానీ, 'పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ ఆవిర్భావం ప్రధాని అసాధారణ దూరదృష్టి ఫలితమే అన్నారు. ఇంధనం, ఇంధన ఉత్పత్తుల్లో గుజరాత్ దేశాన్ని అగ్రగామిగా నిలపాలని ఇరవై ఏళ్ల క్రితం ఆయన నాతో అన్నారు. ప్రపంచ స్థాయి మానవ వనరులను అభివృద్ధి చేయడంలో గుజరాత్ కూడా ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ ప్రముఖ విశ్వవిద్యాలయం ఎలా స్థాపించారు. కాగా ముఖేష్ అంబానీ PDEU వ్యవస్థాపక అధ్యక్షుడు, చైర్మన్ అనే సంగతి తెలిసిందే.

కాన్వొకేషన్‌లో ఈ శతాబ్దం ముగిసేలోపు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారుతుందని తాను స్పష్టంగా చూడగలిగానని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవిస్తుందని, ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్‌ వృద్ధిని అడ్డుకోలేదని అన్నారు.



Next Story

Most Viewed