బడ్జెట్ ధరలో కొత్త 'జీ24 పవర్' స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన మోటోరోలా

by S Gopi |
బడ్జెట్ ధరలో కొత్త జీ24 పవర్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన మోటోరోలా
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ మోటోరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. 'మోటో జీ24 పవర్' పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఈ ఫోన్‌లో ఉంది. 6.6 అంగుళాల డిస్‌ప్లే, 50ఎంపీ వెనుక కెమెరా, మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌సెట్ కలిగి ఉంది. ఐపీ52 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. రెండు వేరియంట్లలో వచ్చే మోటో జీ25 పవర్ 4జీబీ, 128జీబీ ధర రూ. 8,999 ఉంటుందని, 8జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ. 9,999గా ఉంటుందని కంపెనీ వివరించింది. ఎక్స్ఛేంజ్ బోనస్, ఈఎంఐ వంటి సదుపాయాలు కూడా ఉంటాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story