- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Microsoft: 22ఏళ్ల ఆ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక నిర్ణయం తీసుకుంది. గత 22 ఏళ్లుగా అందిస్తున్న వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్ (Skype) సర్వీసులకు ముగింపు చెప్పనుంది. మైక్రోసాఫ్ట్ త్వరలో ఈ సేవలను శాశ్వతంగా నిలిపివేయనుందని సమాచారం. ఈ విషయాన్ని XDA తన నివేదికలో వెల్లడించింది.
కాగా, 2003లో స్కైప్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ సేవల్ని ప్రారంభించింది. 2011లో మైక్రోసాఫ్ట్ ఈ సర్వీసుల్ని కొనుగోలు చేసి.. స్కైప్ సేవల్ని వినియోగదారులకు కొనసాగిస్తూ వచ్చింది. అయితే మైక్రోసాఫ్ట్ 2017లో టీమ్స్ (Teams) పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి స్కైప్‌కు అంతర్గతంగా పోటీ పెరిగింది. దీంతో స్కైప్‌కి ఉన్న ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది.
ఈక్రమంలోనే స్కైప్ సేవలకు గుడ్‌బై చెప్పేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది. ఇక మే నుంచి ఈ సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు స్కైప్ వాడుతున్న వారు టీమ్స్‌కు మార్చుకుని.. అక్కడ నుంచి కాల్స్, చాట్ కొనసాగించొచ్చు.