ఎడ్జ్ బ్రౌజర్‌లో ‘వాయిస్ చాట్’ ఫీచర్‌ను తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్

by Harish |   ( Updated:2023-06-12 14:39:26.0  )
ఎడ్జ్ బ్రౌజర్‌లో ‘వాయిస్ చాట్’ ఫీచర్‌ను తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కారణంగా దాదాపు అన్ని కంపెనీలు కూడా AI ఆధారిత వ్యవస్థను అన్ని విభాగాల్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తన ఎడ్జ్ బ్రౌజర్‌లోని డెస్క్‌టాప్‌లో కొత్తగా ‘వాయిస్ చాట్’ ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా బింగ్ చాట్‌బాక్స్‌లోని మైక్రోఫోన్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఐదు భాషలకు సపోర్ట్ ఇస్తుంది. అవి ఇంగ్లీష్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, మాండరిన్.

ఈ ఫీచర్‌లో వాయిస్ చాట్ మాత్రమే కాకుండా టెక్స్ట్-టు-స్పీచ్ కూడా ఉంది. టెక్స్ట్ ద్వారా అడిగిన ప్రశ్నలకు వాయిస్ ఓవర్ ద్వారా సమాధానం ఇస్తుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. బింగ్ చాట్ పరిమితిని కూడా సెషన్‌కు 30 చాట్‌లు, రోజుకు 300 చాట్‌ల వరకు పెంచారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఐదు భాషలను కలిగి ఉన్నప్పటికీ త్వరలో మరిన్ని భాషలు యాడ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

భారీ ఆఫర్: రూ.23 వేల తగ్గింపుతో Galaxy S22 స్మార్ట్ ఫోన్‌‌..ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్..

Advertisement

Next Story

Most Viewed