VR Headset: Meta Quest 3 వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌కు AI చాట్‌బాట్

by Harish |
VR Headset: Meta Quest 3 వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌కు AI చాట్‌బాట్
X

దిశ, టెక్నాలజీ: Meta Quest 3 వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ అనుభవాన్ని మరింత మెరుగుపర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ Meta AIను దానికి అనుసంధానం చేయబోతున్నారు. దీని ద్వారా ఈ హెడ్‌సెట్‌‌కు Meta అధికారిక AI అసిస్టెంట్ అవుతుంది. దీంతో హెడ్‌సెట్ ధరించినప్పుడు వినియోగదారులు తాము అడిగిన ప్రశ్నలకు సులభంగా సమాధానాలు పొందవచ్చు. వచ్చే నెల నుండి క్వెస్ట్ 3కి Meta AI అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఇది US, కెనడాలో ఆంగ్లంలో అందుబాటులో ఉంటుంది. Meta Horizon OSలో భాగంగా ఇంటిగ్రేషన్ వస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ పరిసరాలను చూడటానికి, అడిగిన ప్రశ్నలకు సమాధానాలను విజన్ రూపంలో పొందడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఒక పువ్వును చూపించి దాని గురించి అడగగానే AI అసిస్టెంట్ వెబ్‌లో వివరాలను వెతికి అందిస్తుంది. ఇంకా, టీ-షర్టు ముందు ఉండి దానికి మ్యాచింగ్ అయ్యే ప్యాంట్‌ను వెతకమనడం లాంటివి కూడా చేయవచ్చు.



Next Story