WhatsApp లో మెసేజ్ ‘ఎడిట్ ఆప్షన్’ ఫీచర్

by Harish |   ( Updated:2023-05-15 11:58:37.0  )
WhatsApp లో మెసేజ్ ‘ఎడిట్ ఆప్షన్’ ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా మరోక ఫీచర్‌ను తీసుకోచ్చింది. అవతలి వారికి పంపించిన మెసేజ్‌లో ఎమైనా తప్పులు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని తెచ్చింది. గత వారం నుంచి టెస్టింగ్ కోసం దీనిని iOS, Android బీటాలలో విడుదల చేసింది. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది. WABetaInfo ప్రకారం, ఎడిట్ ఆప్షన్ ఫీచర్‌ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.10.13, iOS వెర్షన్ 23.10.0.70 లో అందుబాటులో ఉంది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇకమీదట అవతలివారికి పంపిన మెసేజ్‌లను 15 నిమిషాల లోపు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ టైం లోపు ఎన్ని సార్లయినా మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. దీనికోసం మెసేజ్ పై క్లిక్ చేసి కాసేపు అలా హోల్డింగ్‌లో ఉంటే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒక్కసారి మెసేజ్ ఎడిట్ చేశాక, అవతలి వారికి ‘ఎడిటెడ్’ అని ఆ మెసేజ్ క్రింద చూపిస్తుంది.

దీంతో పాటు కంపెనీ మరోక ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ కాల్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను(స్కామ్ కాల్స్) రింగ్ కాకుండా చేయడానికి కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తుంది. ఇది గనక పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే స్కామ్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చు.




Advertisement

Next Story