- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్‌జీ కొత్త క్యూఎన్ఈడీ 83 సిరీస్ టీవీ విడుదల.. ధర రూ. 2,19,990
దిశ, టెక్నాలజీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ బ్రాండ్ ఎల్‌జీ బుధవారం భారత మార్కెట్లో తన కొత్త క్యూఎన్ఈడీ 83 సిరీస్ ఎల్ఈడీ టీవీని విడుదల చేసింది. క్వాంటమ్ డాట్, నానోసెల్ టెక్నాలజీతో కలిపిన డిస్‌ప్లేతో వచ్చిన ఈ టీవీ డాల్బీ విజన్ కలిగి ఉంది. 65 అంగుళాల మోడల్ ధర రూ. 2,19,990, 55 అంగుళాల మోడల్ ధర రూ. 1,59,990గా నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది. 'దేశీయంగా వినియోగదారుల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టీవీని తీసుకురావడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్వాంటమ్ డాట్, నానోసెల్ టెక్నాలజీ కలయికతో పాటు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, డాల్బీ విజన్, ఆట్మోస్‌తో విజువల్ వండర్‌గా ఈ మోడల్ నిలవనుందని' ఎల్‌జీ ఇండియా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ యంగ్ హ్వాన్ జంగ్ చెప్పారు. ఫీచర్ల విషయానికి వస్తే, 4కె రిజల్యూషన్ డిస్‌ప్లేతో స్మార్ట్ డిమ్మింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. దీంతో వీక్షకులు మరింత సహజమైన రంగుల్లో స్క్రీన్‌ని చూడవచ్చు. గేమింగ్ కోసం గేమ్ డ్యాష్‌బోర్డ్, ఆప్టిమైజర్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ ప్లస్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ప్రైమ్ విడియో లాంటి ఓటీటీ ప్లాంట్‌ఫామ్‌లను కలిగి ఉంది.