ఈ నెల చివరినాటికి మార్కెట్లోకి మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్..!

by Harish |   ( Updated:2023-06-07 02:59:48.0  )
ఈ నెల చివరినాటికి మార్కెట్లోకి మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: Itel కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. ఈ మోడల్ పేరు ‘Itel S23’.ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం, ఈ ఫోన్ జూన్ చివరలో లాంచ్ అవుతుందని తెలుస్తుంది. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 8,999 వరకు ఉండే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి, Itel S23 స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 8GB,16GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభించనుంది. ఐటెల్ OS 8.6 బూట్ ఆధారంగా పనిచేస్తుంది. Android v13 ఆధారంగా రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా 50MP ఉండనుంది. ముందు 8MP సెల్ఫీ కెమెరా రానుంది. 10W స్టాండర్డ్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.




Advertisement

Next Story