సరికొత్త ఫీచర్లతో విడుదలైన ‘iQoo Neo 9 Pro’

by Harish |
సరికొత్త ఫీచర్లతో విడుదలైన ‘iQoo Neo 9 Pro’
X

దిశ, టెక్నాలజీ: iQoo కంపెనీ నుంచి కొత్త మోడల్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ గురువారం ఇండియా మార్కెట్లో విడుదలైంది. దీని పేరు ‘iQoo Neo 9 Pro ’. బేస్ వేరియంట్ 8GB RAM+128GB స్టోరేజ్ ధర రూ.35,999. 8GB RAM+256GB స్టోరేజ్ ధర రూ.37,999. 12GB RAM+256GB స్టోరేజ్‌ ధర రూ.39,999. బేస్ వేరియంట్ కాకుండా మిగిలిన రెండు కూడా ఫిబ్రవరి 23 నుంచి అమ్మకానికి ఉంటాయి.

కొనుగోలు సమయంలో HDFC, ICICI బ్యాంక్ కార్డులపై రూ.2000 తగ్గింపు కూడా ఉంటుంది. బేస్ వేరియంట్ మాత్రం మార్చి 21 నుంచి కొనుగోలుకు లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకంగా వెట్ టచ్ టెక్నాలజీని అందించారు. దీంతో తడి చేతితో కూడా ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.


iQoo Neo 9 Pro స్పెసిఫికేషన్స్

* 6.78-అంగుళాల 1.5K (1,260x2,800 పిక్సెల్‌లు) LTPO AMOLED డిస్‌ప్లే

* ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14పై రన్ అవుతుంది.

* 120Hz రిఫ్రెష్ రేట్, గేమ్స్ ఆడే సమయంలో 144Hz రిఫ్రెష్ రేట్‌ ఉంటుంది.

* స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.

* బ్యాక్ సైడ్ 50MP+8MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* 120W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది.

* ఇది దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed