120W చార్జింగ్ సపోర్ట్‌తో iQoo కొత్త స్మార్ట్ ఫోన్

by Harish |
120W చార్జింగ్ సపోర్ట్‌తో iQoo కొత్త స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: iQoo నుంచి ‘Neo 7 Pro 5G’ స్మార్ట్ ఫోన్ జూన్ 20న ఇండియాలో లాంచ్ కానుందని టిప్‌స్టర్ నివేదిక పేర్కొంది. ఇది 16GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. దీని ధర రూ. 40 వేల వరకు ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో 1260 X 2800 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ద్వారా రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP, 2MP డెప్త్ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరాను అందించారు. ఫోన్‌లో 120W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.




Advertisement

Next Story