Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తీపి కబురు.. ఫిబ్రవరి నుంచి వారికి వేతనాలు పెంపు

by Vennela |
Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తీపి కబురు.. ఫిబ్రవరి నుంచి వారికి వేతనాలు పెంపు
X

Infosys Salary Hike: చాలా కాలం నుంచి వేతనాల పెంపుకోసం ఎదురుచూస్తున్న ఇన్ఫోసిస్( Infosys) ఉద్యోగులకు గుడ్ న్యూస్. వేతనాలకు పెంపునకు సంబంధించిన లెటర్స్ త్వరలోనే ఉద్యోగుల చేతికి అందుతాయని సమాచారం. పలు రిపోర్టుల ప్రకారం 2025 ఫిబ్రవరిలో వార్షిక జీతాల(Salary Hike) పెంపును ఇన్ఫోసిస్ ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నగదు ఆదా కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో వేతన పెంపును స్తంభింపజేసిన ఇన్ఫోసిస్(Infosys)...అక్టోబర్ 2023లో యాన్యువల్ అప్రైజల్ సైకిల్(Annual Appraisal Cycle) ను ప్రారంభించింది. చివరిసారిగా 2023 నవంబర్ 1న ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల (Infosys employee salaries)పెంపు ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఇది 2022 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు సంబంధించిన అప్రైజల్ పీరియడ్. 2023 డిసెంబర్ లో ఉద్యోగులకు రేటింగ్ లెటర్స్ కూడా అందాయి. సాధారణంగా జులైలో అమల్లోకి వచ్చే పెంపుకోసం జూన్ లో లెటర్స్ అందుతాయి.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే వార్షిక వేతన పెంపును 2025 ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ ప్రారంభించే ఛాన్స్ ఉందని ఓ నివేదిక తెలిపింది. దీని ప్రకారం జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులు మొదట అప్రైజల్ లెటర్స్(Appraisal Letters) అందుకునే ఛాన్స్ ఉంది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్టు ప్రకారం జనవరి 1 నుంచి ఈ వేతనాలు అమల్లోకి వస్తాయి. జాబ్ లెవల్లోని ఉద్యోగులకు ఫిబ్రవరిలో లేఖలు అందుతాయి. జేఎల్ 6 అంతకంటే ఎక్కువ లెవల్స్ లో ఉన్నవారికి మార్చిలో లెటర్స్ అందుతాయి.

అయితే వేతనాల పెంపు వార్తలపై ఇన్ఫోసిస్( Infosys) ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనిపై ఒక అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జేఎల్ 5 లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు(Software engineers), సీనియర్ ఇంజనీర్లు(Senior Engineers), సిస్టమ్ ఇంజనీర్స్(System Engineers), కన్సల్టెంట్లు ఉంటారు. జేఎల్ 6 అంతకంటే ఎక్కువ లెవల్స్ లో మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు(Senior managers), డెలివరీ మేనేజర్లు, సీనియర్ డెలివరీ మేనేజర్లు ఉంటారు.


Next Story

Most Viewed