- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
BMW డిజైన్‌తో Infinix సరి కొత్త స్మార్ట్‌ఫోన్

దిశ, వెబ్‌డెస్క్: Infinix కంపెనీ కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Note 30 VIP రేసింగ్ ఎడిషన్’. ఇది ప్రస్తుతానికి ఎంపిక చేసిన దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా BMW Designworks సహకారంతో తీసుకొచ్చారు. దీని ధర రూ. 26,000. భారత్‌లో ప్రస్తుతానికి అందుబాటులో లేదు. త్వరలో లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz గా ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరాలను అమర్చారు. ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరాను అందించారు. దీనిలో 68W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని అమర్చారు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ డిస్‌ప్లే కింద ఉంది.