చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలా.. ఇలా చేయండి!

by Disha Web Desk 8 |
చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలా.. ఇలా చేయండి!
X

దిశ, ఫీచర్స్ : పుట్టిన వారు గిట్టక తప్పదు. జన్మించిన ప్రతి జీవి అనేది మరణిస్తుంది. ఇక మరణం అనేది ఎప్పుడు, ఎలా అయినా రావచ్చును. అయితే కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. కొంత మంది చనిపోయిన వారి ఏటీఎం కార్డు వాడుతుంటారు. అయితే అలా వాడటం అనేది చట్టరీత్యా చాలా తప్పు. అయితే కొంత మందికి ఏటీఎం కార్డు ఉండదు. దీంతో వారి అకౌంట్‌లో ఉన్న డబ్బులు ఎలా తీసుకవాలి.. వారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ ఎలా తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కాగా అలాంటి వారి కోసమే ఈ సమాచారం.

అయితే తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే, వారి బ్యాంక్ అకౌంట్ నామినీలు సంబంధిత పత్రాలు తీసుకెళ్లి బ్యాంకు అధికారులకు సమర్పించాలంట. ముఖ్యంగా మరణ ధృవీకరణ పత్రాలు బ్యాంకు అధికారులకు అందజేయాలి. అలాగే నానీని వారి సొంత కేవైసీ విధానాలు పూర్తి చేసి ప్రభుత్వ అధికారుల నుంచి సంబంధిత పత్రాలపై ధృవీకరణ పొందాలి. నామీనీ ఐడీ, అడ్రస్ ప్రూఫ్ ఇలా పలు పత్రాలు జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నామినీ కేవలం డబ్బుకు సంరక్షకుడు మాత్రమే, డబ్బును మరణించిన వారి వారసులకు సమానంగా పంపిణీ చేయాలి. లేకపోతే చట్టపరమైన సమస్యల్లో చిక్కు కోవాల్సి వస్తుంది. కానీ కొందరు అలా చేయకుండా తమకే ఆ డబ్బు అన్నట్లు తీసుకుంటారు. కానీ ఇది చట్టరీత్యా నేరం. అదేవిధంగా ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు నామినీని పెట్టకపోయినా.. వారి మరణం తర్వాత చట్టబద్ధమైన వారసుల ధృవీకరణ పత్రాన్ని, మరణ ధృవీకరణ పత్రాన్ని అందజేసి డబ్బును తీసుకోవచ్చు.

Next Story