ఫేక్ వెబ్ సైట్లను ఎలా గుర్తించాలంటే..?

by D.Reddy |   ( Updated:2025-01-21 02:59:53.0  )
ఫేక్ వెబ్ సైట్లను ఎలా గుర్తించాలంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేవారు నిత్యం అనేక వెబ్ సైట్లను విజిట్ చేస్తుంటారు. అయితే అందులో ఏది ఫేక్ వెబ్ సైట్, ఏది నిజమైనదో తెలియక సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల డబ్బును పొగొట్టుకుంటున్నారు. ఒక వెబ్​సైట్ నకిలీదా, ఒరిజినల్‌దా? అని తెలుసుకునేందుకు టెక్ నిపుణులు కొన్ని సూచనలు చేశారు.

ఎలా గుర్తించాలంటే..?

* ఏదైనా వెబ్​సైట్ ఓపెన్ చేసేముందు ముందుగా దాని డొమైన్ అడ్రెస్‌ను చెక్ చేసుకోవాలి.

* అసలు వెబ్‌సైట్‌ ఏదైనా https:// ఆ తర్వాత సంస్థ పేరుతో ప్రారంభమవుతుంది. ఇవి లేకుంటే అనుమానించాలి.

* అలాగే అడ్రెస్ చివర్లో . com, .org, .in కామన్ డొమైన్స్ ఉన్నాయో, లేదో చూసుకోవాలి.

* నేరగాళ్లు ఉపయోగించే వెబ్‌సైట్లు కొద్దికాలం కోసమే తయారుచేస్తారు. ఇటీవలే వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు కనిపిస్తే అనుమానించాల్సిందే.

* బ్రాండెడ్‌ సంస్థల వెబ్‌సైట్‌ తెరిచినప్పుడు పైన అడ్రస్‌బార్‌/URL బార్‌ ప్రారంభంలో కనిపించే ప్యాడ్‌లాక్‌ మీద క్లిక్‌ చేస్తే వెబ్‌సైట్‌ సమాచారం వస్తుంది.

* ఏదైనా వెబ్‌సైట్‌ తెరిచి ప్యాడ్‌లాక్‌ క్లిక్‌ చేసినప్పుడు వెబ్‌సైట్‌ భద్రతా ప్రమాణాలను తెలియజేస్తూ హెచ్చరిస్తుంది. నకిలీదైతే వెబ్‌సైట్లలో ఏదైనా సమాచారం నమోదు చేస్తే డేటా చోరీకి గురవుతుందని సూచిస్తుంది.

Next Story

Most Viewed