Honor నుంచి మ్యాజిక్‌బుక్ సిరీస్‌లో రెండు ల్యాప్‌టాప్‌లు లాంచ్

by Harish |
Honor నుంచి మ్యాజిక్‌బుక్ సిరీస్‌లో రెండు ల్యాప్‌టాప్‌లు లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: Honor కంపెనీ ఇటీవల భారత్‌లో రెండు మ్యాజిక్‌బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. వీటి పేరు ‘Honor MagicBook X14 (2023), Honor MagicBook X16 (2023)’. ఈ రెండు కూడా 12th Gen i5-12450H ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తాయి. Honor MagicBook X14 (2023) మోడల్ 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 48,990, 16GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 51,990. ఇది 88 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 14-అంగుళాల పూర్తి HD (1920x1080) IPS స్క్రీన్‌ను కలిగి ఉంది.



Honor MagicBook X16 (2023) మోడల్ ల్యాప్‌టాప్ 16-అంగుళాల పూర్తి HD (1920x1080) IPS డిస్‌ప్లేతో 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. దీని 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 50,990, 16GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 53,990. ల్యాప్‌టాప్‌లు 65W టైప్-సి ఫాస్ట్ చార్జర్ సపోర్ట్‌తో 60Whr బ్యాటరీని కలిగి ఉంటాయి. ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఈ రెండు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. కొనుగోలు సమయంలో రూ. 2,500 వరకు తగ్గింపు కూడా ఉంది.




Advertisement

Next Story