- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీశాట్-20... ఆంతరిక్ష ప్రయోగాలకు ఇది సుపథం
దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20ని స్పేస్ ఎక్స్ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.స్పెస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్-20న నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా నిర్వహించిన ఈ ప్రయోగం దిగ్విజయంగా ముగిసింది.ఈ ప్రయోగ విజయంతో భారత, అమెరికా అంతరిక్ష సంబంధాల్లో కొత్త శకానికి దారితీసినట్లయింది. 14 ఏళ్ల పాటు సేవలిందించనున్న జీశాట్-20 ఉపగ్రహం దేశంలోని మారు మూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందించనుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు.
నిరంతరం మేధోమథనం చేస్తూ అంతరిక్ష రంగంలో సవాళ్ళను సాంకేతికంగా అధికమిస్తు ఆకాశమే హద్దుగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆకుంఠిత దీక్షతో ఖచ్చితత్వంతో నియమిత వ్యయంతో పరిమితులను అధిగమించి. పరిణితితో విజయాలకు మరో చిరునామాగా ఆంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్న భారత్ మరో కీలక లక్ష్యం దిశగా సాగుతోంది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అత్యంత అధునాతన ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్‌తో చేతులు కలిపింది. ఇస్రో అభివృద్ధి చేసిన జీశాట్-20 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి స్పేస్‌ఎక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది రెండు సంస్థల మధ్య మొదటి వాణిజ్య సహకారం.
జీశాట్-ఎన్2 ఉపగ్రహం
దేశంలోని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో ఇస్రో రూపొందించిన జీశాట్-ఎన్2 (జీశాట్- 20) ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్క చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులో తేవటమే ఈ ప్రయోగం లక్ష్యం. అంతేకాకుండా జీశాట్-ఎన్2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. దాదాపు 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లేందుకు ఇస్రోకు చెందిన ఎంకే-3 వాహకనౌకకు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా స్పేస్ఎక్స్ కలిసి జీశాట్- ఎన్2ను ప్రయోగించనున్నారు భారత ప్రాంతం అంతటా బ్రాడ్‌బ్యాండ్ సేవలు విమానాలలో వైఫై సమాచార వ్యవస్ద మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది. జీశాట్-ఎన్2 ఇది బహుళ ప్రమూజనాలకి అనువైన స్పాట్ బీమ్‌లు మరియు వైడ్‌బ్యాండ్ ట్రాన్స్‌పాండర్‌లను కలిగి ఉన్న ఈ ఉపగ్రహం ., ఫ్రీక్వెన్సీ పునర్వినియోగాన్ని అనుమతించే మల్టీ-బీమ్ ఆర్కిటెక్చర్ ద్వారా సిస్టమ్ నిర్గమాంశను గణనీయంగా పెంచుతుంది” GSAT-2014 సంవత్సరాల పాటు పనిచేస్తుంది.
“జీశాట్-ఎన్2 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో స్పేస్‌ఎక్స్‌ని ఎందుకు ఎంచుకుంది?
ఇంతకుముందు, ఇటువంటి భారీ ఉపగ్రహ ప్రయోగాల కోసం ISRO ఫ్రెంచ్ వాణిజ్య ప్రయోగ సర్వీస్ ప్రొవైడర్ ఏరియన్‌స్పేస్‌పై ఆధారపడింది, అయితే, కంపెనీకి ప్రస్తుతం కార్యాచరణ రాకెట్‌లు లేవు. ఉక్రెయిన్ వివాదం కారణం భారతదేశానికి అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికగా స్పేస్‌ఎక్స్ మారింది. ఇస్రో తొలిసారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ సహాయం తీసుకోనున్నది. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఇటీవల ఇస్రో పలు దేశాలకు చెందిన రాకెట్లను నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతూ.. భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. భారతదేశం దగ్గర ఉన్న ఉపగ్రహ వాహకనౌకలు మార్క్-3 రాకెట్ 4వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది. కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన GSAT-20 నింగిలోకి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ రాకెట్ బరువు 4700 కిలోల బరువు ఉంటుంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ జీశాట్-ఎన్2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. స్పేస్‌ఎక్స్ రాకెట్‌ని ఉపయోగించుకొని ఇస్రో చేపడుతున్న తొలి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగం ఇదేకావడం విశేషం. ఇదిలా జీశాట్-ఎన్2 శాటిలైట్ విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే, భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ని విస్తరించనున్నది.
అమెరికా – ఇండియా మధ్య వాణిజ్య సహకారం
ప్రయోగానికి $60-70 మిలియన్ల మధ్య ఖర్చయింది, ఇది ఉపగ్రహ సాంకేతికతలో భారతదేశానికి గణనీయమైన పెట్టుబడిని సూచిస్తుంది. భారత ఆమెరికా దేశాలు అంతరిక్ష సహకారం యొక్క అన్ని రంగాలలో కొత్త సరిహద్దులను చేరుకోవడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ కొత్త ఉపగ్రహ ఒప్పందం ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రక్రియ ఫలితాలను ఇస్తోంది అంతరిక్ష శాస్త్రం మరియు అంతరిక్ష సాంకేతికత ఉపగ్రహాల ప్రయోగంలో ఇరుదేశాల షకారం మానవ అంతరిక్ష ప్రయాణ సహకారం కోసం వ్యూహాత్మక విధివిధానాలు భాగస్వామ్య వానిఝ్య ఒప్ప్మదాలు పరిశోధన మరియు అభివృద్ధిలో పరస్పరం సహకారం ఆందించుకొనే దిశగా నాసా మరియు ఇస్రో నిర్ణయం ఆంతేకాకుండా ప్రవేట్ సంస్దలతోనూ ఈ రంగంలో ఒప్పందాలను చేసుకోటానికి అవకాశం కల్పించారు. ఈ సహకారంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారతీయ వ్యోమగామిని పంపడానికి స్పేస్‌ఎక్స్‌ని మధ్య మరొక వాణిజ్య ఒప్పందాన్ని అనుసరిస్తుంది, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో స్పేస్‌ఎక్స్ ను మరింత సుస్థిరం చేస్తుంది. గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో భారతదేశం తన పరిధిని విస్తరించుకోవడం కొనసాగిస్తున్నందున, స్పేస్‌ఎక్స్‌ని వంటి సంస్థలతో భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమం యొక్క భవిష్యత్తును నిర్వచించవచ్చు. వాణిజ్య విపణిలో సైతం భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్ద మరింత విదేశీమారకద్రవ్యాన్ని ఆర్జింస్తుంది అన్నది నిర్వివాదాంశం.
వాడవల్లి శ్రీధర్
99898 55445
- Tags
- GSAT-20