Google Warning : ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. ఆ పని చేయకపోతే అంతే సంగతి!

by D.Reddy |   ( Updated:2025-03-09 16:16:53.0  )
Google Warning : ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. ఆ పని చేయకపోతే అంతే సంగతి!
X

దిశ, వెబ్ డెస్క్: ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు గూగుల్ (Google) హెచ్చరికలు జారీ చేసింది. తమ ఫోన్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. లేదంటే పర్సనల్ డేటా హ్యాక్ (Personal data hack) అయ్యే ప్రయాదం ఉందని వెల్లడించింది. పలు సెక్యూరిటీ లోపాల కారణంగా సైబర్ నేరగాళ్లు మాల్వేర్ సాఫ్ట్‌వేరు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇంజెక్ట్ చేసి వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది.

ఈ నేపథ్యంలోనే ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని జామ్ఫ్ సీనియర్ సెక్యూరిటీ స్ట్రాటజీ మేనేజర్ ఆడమ్ బాయ్న్టన్ హెచ్చరించారు. సెక్యూరిటీ లోపం కలిగిన ఫోన్లలో హ్యాకర్లు మాల్వేర్ ఫైల్‌ స్టోర్ చేసిన Android/data, Android/obb, Android/sandbox ఫోల్డర్‌లను ఇంజెక్ట్ చేసి యాక్సెస్ చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత డేటాను దొంగలించటంతో పాటు ఆర్థికపరమైన మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ సెక్యూరిటీ లోపాలను పరిష్కరించేందుకు గూగుల్ ఇప్పటికే సెక్యూరిటీ అప్‌డేట్స్ విడుదల చేసింది. వాటిని అప్‌డేట్ చేసుకొని డేటాను భద్రపర్చుకోవచ్చు.

అయితే, పిక్సెల్ ఫోన్ యూజర్లు ఇప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ, శాంసంగ్, వన్‌ప్లస్, షావోమీ ఇతర ఆండ్రాయిడ్ బ్రాండ్‌ల యూజర్లు మరింత కాలం వేచి ఉండాల్సి రావచ్చు.

మీ ఫోన్ అప్‌డేట్ చేసుకొండిలా..

* ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లో (Settings) ఒపెన్ చేయాలి.

* సెక్యూరిటీ అండ్ అప్‌డేట్స్ (Security & updates) సెలక్ట్ చేయాలి.

* 'సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (Software Update)' క్లిక్ చేయండి.

* ఏదైనా అప్‌డేట్ (Update) ఉంటే ఇన్‌స్టాల్ చేయండి.

* అలాగే గూగుల్ అకౌంట్ అదనపు సెక్యూరిటీ కోసం టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ సెటప్ చేసుకోండి.

Read Also..

Flight Tickets: హోలీ ఆఫర్‌..రూ.1199కే ఫ్లైట్ టికెట్ బుకింగ్‌.. పూర్తి వివరాలివే!

Next Story