Google Messages: అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్ మెసేజెస్.. ఏంటో తెలుసా?

by D.Reddy |
Google Messages: అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్ మెసేజెస్.. ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అలాగే, ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వారికి గూగుల్ మెసేజెస్ (Google Messages) యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గూగుల్‌ వినియోగదారులను తన మెసేజింగ్‌ యాప్‌ మరింత ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఇందులో భాగాంగా తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది గూగుల్.

కొత్త ఫీచర్ ఏంటంటే.. గూగుల్ మెసేజెస్ నుంచి నేరుగా వాట్సాప్‌ (WhatsApp) వీడియో కాల్ చేసే విధంగా గూగుల్ ఈ ఫీచర్‌ను రూపొందిస్తుంది. కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేయడానికి త్వరలో ఈ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. గూగుల్ మెసేజెస్ యాప్‌లో చాటింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ పైభాగంలో కుడివైపున ఈ వీడియో కాల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే నేరుగా వాట్సాప్ వీడియో కాల్ కనెక్ట్ అవుతుంది. అదనంగా, గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి వాట్సాప్‌కు స్విచ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఒకవేళ సదరు యూజర్ ఫోన్‌లో వాట్సాప్ లేకపోతే, గూగుల్ మీట్ (Google Meet) ద్వారా వీడియో కాల్ చేసుకోవచ్చు.

ఇక త్వరలోనే గూగుల్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే, ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రస్తుతం ఒక్క వ్యక్తికి మాత్రమే వీడియో కాల్‌ చేయగలరు. గ్రూప్‌ కాలింగ్‌కు సాధ్యం కాదు. రానున్న రోజుల్లో గ్రూప్‌ కాల్స్‌ను ఈ ఫీచర్‌ను విస్తరించనుంది. ఈ కొత్త ఫీచర్‌ అధికారికంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలను గూగుల్‌ ఇంకా వెల్లడించలేదు. కాగా, ఇటీవల గూగుల్ 'Your Profile' అనే మరో కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్ల ప్రొఫైల్‌పై అదనపు నియంత్రణ కల్పించేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.



Next Story

Most Viewed