- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ లెన్స్ కొత్త ఫీచర్: ఒక్క ఫొటోతో మీ స్కిన్ కండిషన్ చెప్పేస్తుంది!
దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ గూగుల్ ఆధారిత Google Lens(గూగుల్ లెన్స్) కొత్తగా అదిరిపోయే అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. గూగుల్ లెన్స్ ద్వారా చర్మాన్ని స్కాన్ చేసి చర్మ కండిషన్ గురించి చెప్పే కొత్త ఫీచర్‌ను తెచ్చింది. చర్మంపై వచ్చే దద్దుర్లు, వాపులు, వెంట్రుకలు రాలిపోవడం మొదలగు చర్మ సమస్యల గురించి యూజర్లను హెచ్చరిస్తుంది.
గూగుల్ లెన్స్‌తో చర్మంను ఫొటో తీస్తే ఆ ప్లేస్‌లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలను యూజర్లకు తెలియజేస్తుంది. ఇది కేవలం ప్రజలకు ఒక ఇన్‌ఫర్మేషన్‌గా మాత్రమే ఉపయోగపడుతుందని, వ్యాధి నిర్ధారణ క్రింద పరిగణించకూడదని గూగుల్ పేర్కొంది. పూర్తి వివరాల కోసం మాత్రం డాక్టర్లను సంప్రదించాలని కంపెనీ తెలిపింది.
Google లెన్స్‌లో AI ఆధారిత వ్యవస్థను తీసుకురావడంతో ఇది స్మార్ట్‌గా రూపాంతరం చెందుతుందని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గూగుల్ లెన్స్ ఉపయోగిస్తున్నారు. తెలియని వస్తువులు, వివిధ అంశాలు, సైన్ బోర్డులు, భాషలను ట్రాన్స్‌లేట్ చేయడం, ఫొటోలు మొదలగు వాటిని లెన్స్ సహయంతో స్కాన్ చేసి యూజర్లకు అన్ని వివరాలు అందించడంలో గూగుల్ లెన్స్ సహయపడుతుంది.