ECG, హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో అదిరిపోయే గూగుల్ 'ఫిట్‌బిట్' స్మార్ట్ వాచ్‌లు

by Harish |   ( Updated:2022-08-26 14:00:26.0  )
ECG, హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో అదిరిపోయే గూగుల్ ఫిట్‌బిట్ స్మార్ట్ వాచ్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ ఆధ్వర్యంలోని స్మార్ట్‌వాచ్ కంపెనీ 'ఫిట్‌బిట్' కొత్తగా మూడు మోడళ్లను విడుదల చేసింది. ధరించడానికి అనువుగా ఉండే ఇన్‌స్పైర్ 3(Inspire 3), వెర్సా 4(Versa 4), సెన్స్ 2( Sense 2 ) వాచ్‌లను లాంచ్ చేసింది. లేటెస్ట్ టెక్నాలజీతో వీటిని తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

Sense 2

Fitbit Sense 2 స్మార్ట్‌ వాచ్ ఒత్తిడి వివరాలను తెలపడానికి హార్ట్‌బీట్ మానిటర్, బాడీ టెంపరేచర్ రెస్పాన్స్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ఆధారిత స్మార్ట్ వాచ్. ECG యాప్, PPG అల్గారిథం (FDA, CE మార్క్ ) ద్వారా కర్ణిక దడ సంకేతాలను గుర్తించగల సెన్సార్‌లతో గుండె ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. స్మార్ట్ వాచ్ కొత్త Fitbit OS ద్వారా పనిచేస్తుంది. ఇది ఆరు రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. దీని ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది.



Inspire 3

Fitbit ఇన్‌స్పైర్ 3 ఎంట్రీ-లెవల్ హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. హార్ట్‌బీట్ రేటు, స్లీప్ మానిటరీంగ్, శ్వాస రేటు, ఆక్సిజన్ spo2, బాడీ టెంపరేచర్‌ను ట్రాక్ చేసే ఫీచర్లను కలిగి ఉంది. రోజు శరీరంలో ఎన్ని కేలరీలు ఖర్చు అయ్యాయి అనే వివరాలను చూపిస్తుంది. ఇది 50 మీటర్ల వరకు నీటిలో పడిన పనిచేయగలదు. వాకింగ్/జాగింగ్ చేసినప్పుడు దూరాన్ని ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది. దీని ధర రూ. 8,999.



Versa 4

Versa 4 ఇంతకు ముందున్న వెర్షన్‌తో పోలిస్తే చాలా తేలికైనది, అధునాతన టెక్నాలజీతో వస్తుంది. ఇది GPS, యాక్టివ్ జోన్ మినిట్స్, డైలీ యాక్టీవిటీ డెవలప్‌మెంట్ ఫీచర్‌లను కలిగి ఉంది. 40 కంటే ఎక్కువ వ్యాయామ మోడ్‌లను అందిస్తుంది. Fitbit ప్రీమియంతో 1,000 కంటే ఎక్కువ వర్కౌట్‌లను కలిగి ఉంది. వెయిట్‌లిఫ్టింగ్, క్రాస్‌ఫిట్, డ్యాన్స్ వంటి కొత్త ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. Versa 4 స్మార్ట్ వాచ్ కొత్త Fitbit OSతో వస్తుంది. కేవలం 12 నిమిషాల ఛార్జింగ్‌తో ఒక రోజు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ పేర్కొంది. మొత్తంగా ఇది 6 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ. 20,499.

స్మార్ట్‌వాచ్‌లు Android, iOS డివైజ్‌లకు సపోర్ట్ చేస్తాయి.

ఇవి కూడా చదవండి : రెండు సార్లు టచ్ చేస్తే చాలు.. ఫొటోలు తీసే Oppo కొత్త ఇయర్‌బడ్స్




Advertisement

Next Story