- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్.. Google సరికొత్త ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ ఖాతాల్లో లాగిన్ అవ్వాలంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిందే. ఒక్కో ఖాతాకు ఒక్కో పాస్‌వర్డ్ కారణంగా చాలా మంది వాటిని మర్చిపోతుంటారు. ఈ సమస్య ప్రతి యూజర్‌కు ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య కాలంలో ప్రతిదానికి ఆన్‌లైన్ మీద ఆధార పడటం, ప్రతి అకౌంట్‌కు వేరే వేరే పాస్‌వర్డ్‌లను సెట్ చేయడం, వాటిని గుర్తుంచుకోవడం చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. దీంతో సెర్చింజన్ గూగుల్ కొత్తగా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ‘పాస్‌కీస్ (Passkeys)’ అనే సులభమైన, సురక్షితమైన లాగిన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాస్‌కీస్ అనేది ఫేస్‌ఐడీ, టచ్ ఐడీ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానం. ఇది చాలా సెక్యూరిటీని కలిగి ఉంటుంది.
ఈ కొత్త పద్ధతి ద్వారా యూజర్లు తమ ఖాతాలకు ఎలాంటి పాస్‌వర్డ్‌లు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఫింగర్‌ప్రింట్, ఫేస్ స్కాన్, స్క్రీన్ లాక్ ఆప్షన్ ఉపయోగించి లాగిన్ కావచ్చు. ఈ లాగిన్ విధానంలో ఒక్కసారి వీటిని వెరిఫై చేసిన తర్వాత పాస్‌వర్డ్‌ను ప్రతీసారి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. సైబర్ నేరాల్ని అరికట్టేందుకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఆప్షన్ పొందడానికి యూజర్లు తప్పనిసరిగా పాస్‌కీస్‌ను ఎనెబుల్ చేయాలి.
మొబైల్‌లో గూగుల్ సెట్టింగ్‌లోకి వెళ్ళి పాస్‌కీస్ ఆప్షన్ ఎనెబుల్ చేయాలి. తరువాత ఫింగర్‌ప్రింట్, ఫేస్ స్కాన్, స్క్రీన్ లాక్ ఆప్షన్‌లతో కొత్త పాస్‌కీస్ క్రియేట్ అవుతుంది. అదే డెస్క్‌టాప్ వాడుతున్న వారు కీబోర్డులో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ ఉంటే పాస్‌కీస్‌ను ఎనెబుల్ చేయవచ్చు. అకౌంట్లకు లాగిన్ అయ్యే ప్రతిసారి లాగిన్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా గూగుల్ పాస్‌కీస్‌తో సులభంగా లాగిన్ కావచ్చు.
ఈ ఫీచర్ ద్వారా హ్యకర్స్ ఎవరు లాగిన్ కావడానికి కుదరదు, ఎందుకంటే ఈ ఫీచర్‌లో అకౌంట్లకు లాగిన్ కావాలంటే తప్పనిసరిగా ఫిజికల్‌గా యాక్సెస్ పొందాల్సి ఉంటుంది. హ్యాకర్స్‌కు ఇది సాధ్యం కాదు, కాబట్టి పాస్‌కీస్ సదుపాయం ద్వారా అకౌంట్లను హ్యాకింగ్ చేయడం కుదరదు.