ఇక ఈజీగా Gmail లో పాత ఫైల్స్, మెయిల్స్ వెతకండి.. గూగుల్ కొత్త ఫీచర్

by Harish |
ఇక ఈజీగా Gmail లో పాత ఫైల్స్, మెయిల్స్ వెతకండి.. గూగుల్ కొత్త ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ గూగుల్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తు వినియోగదారులకు పని భారాన్ని తగ్గిస్తుంది. తాజాగా జీమెయిల్‌కు సంబంధించి కొత్తగా మరోక ఫీచర్‌ను తీసుకువచ్చింది. జీమెయిల్‌‌లో పాత మెయిల్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్ వెతకడం చాలా కష్టంగా ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ ద్వారా వెతికిన కూడా కొన్ని సార్లు కరెక్ట్ ఫైల్/మెయిల్ దొరకకపోవచ్చు. ఈ సమస్య చాలా మందికి వచ్చే ఉంటుంది. దీని గురించి పలువురు యూజర్లు కంపెనీని అభ్యర్థించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేసే ఫీచర్‌ను తెచ్చింది. దీని సహాయంతో అత్యంత కచ్చితత్వంతో, ఈజీగా మెయిల్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్ వెతకవచ్చు అని గూగుల్ పేర్కొంది.

స్మార్ట్ ఫోన్లో జీమెయిల్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌ లోపల ‘టాప్ రిజల్ట్స్’ అనే సెక్షన్ ఉంటుంది. దీనిలో మీకు కావాల్సిన ఫైల్స్/మెయిల్/ డాక్యుమెంట్‌కు సంబంధించిన ఏదో ఒక పదాన్ని టైప్ చేసి కావాల్సిన వాటిని తిరిగి పొందవచ్చు. ఏఐ ఆధారిత మెషిన్ లెర్నింగ్ అల్గారిథం ఫైల్స్ వెతకడానికి సహాయం చేస్తుంది. దీని ద్వారా కావాల్సిన ఫైల్‌ను అత్యంత కచ్చితత్వంతో తక్కువ సమయంలో పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ స్మార్ట్ ఫోన్‌లోని జీమెయిల్‌లకు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో అందరికి విడుదల చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed