Google AI Feature: గూగుల్ నుంచి మరో కొత్త ఏఐ ఫీచర్.. ఫేక్ ఫోటోను ఈజీగా గుర్తుపట్టేయ్యొచ్చు..!

by Maddikunta Saikiran |
Google AI Feature: గూగుల్ నుంచి మరో కొత్త ఏఐ ఫీచర్.. ఫేక్ ఫోటోను ఈజీగా గుర్తుపట్టేయ్యొచ్చు..!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం మార్కెట్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత టూల్స్(Tools), ఫీచర్లు(Features) అధికవమవుతున్న విషయం తెలిసిందే. ఏఐ సాయంతో చాలా మంది ఈజీగా ఫోటోలు(Photos) , వీడియో(videos)లు క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఏది ఫేక్ ఫోటోనో, ఏది రియల్ ఫోటోనో గుర్తించడం కష్టంగా మారింది. ఈ ప్రాబ్లమ్ కు చెక్ పెట్టేందుకు గూగుల్ ఫోటోస్(Google Photos) తాజాగా సరికొత్త ఏఐ ఫీచర్(AI Feature)ను ప్రవేశ పెట్టింది. 'ఏఐ ఇన్ఫో(AI Info)' పేరుతో దీన్ని అందుబాటలోకి తీసుకొచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. ఈ ఫీచర్ సాయంతో ఫేక్ ఫోటోలను, ఫేక్ వీడియోలను ఈజీగా తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు గూగుల్ తన బ్లాగ్ పోస్టులో ఈ విషయాన్ని పంచుకుంది. అయితే ఎడిట్ చేసే ఫోటోలను మాత్రమే గుర్తించవచ్చని తెలిపింది.

ఈ ఫీచర్ ను యాక్సెస్ చేసుకోవాలనుకుంటే యూజర్లు గూగుల్ ఫోటోస్ యాప్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఏదైన ఫోటోను సెలెక్ట్ చేసి కిందకు స్క్రోల్ చేయగానే డీటీయల్స్(Details) అనే ఆప్షన్ వస్తుంది. ఒకవేళ ఏఐతో క్రియేట్ చేసిన ఫోటో అయితే అందులో 'ఎడిటెడ్ విత్ గూగుల్ ఏఐ(Edit With Google AI)' అని సూచిస్తుంది. దీంతో ఆ ఫోటో నిజమైనదా, కాదా అని తెలిసిపోతుంది. కాగా యూజర్లను ఆకట్టుకోవడానికి ఫోటో ఎడిటింగ్ యాప్(Photo Editing App)లు ఎప్పటికప్పుడు ఏఐ ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. దీంతో గూగుల్ కూడా మ్యాజిక్ ఎడిటర్(Magic Editor), మ్యాజిక్ ఎరేజర్(Magic Eraser) సహా ఇతర ఏఐ ఫీచర్లను ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

Next Story