టైప్ - సి పోర్ట్‌తో మొట్టమొదటి ఫీచర్ ఫోన్.. ధర ఎంతంటే..

by Sumithra |
టైప్ - సి పోర్ట్‌తో మొట్టమొదటి ఫీచర్ ఫోన్.. ధర ఎంతంటే..
X

దిశ, ఫీచర్స్ : ఇప్పటి వరకు యూఎస్బీ టైప్-సి పోర్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో వేగంగా ఛార్జింగ్ ఎక్కేందుకు, డేటా బదిలీ కోసం అందుబాటులో ఉంది. అయితే మొట్టమొదటిసారిగా ఒక కంపెనీ ఫీచర్ ఫోన్‌లో యూఎస్బీ టైప్-సి పోర్ట్‌ను అందించింది. అవును, ఐటెల్ కస్టమర్ల కోసం కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. ఐటెల్ పవర్ 450 ఫీచర్ ఫోన్‌లో యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఇవ్వడం ఒక ప్రత్యేకత. ఈ ఫీచర్ ఫోన్ ధర ఎంత, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కాకుండా ఐటెల్ పవర్ 450 ప్రత్యేకత ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐటెల్ పవర్ 450 ధర..

ఐటెల్ కంపెనీకి చెందిన ఈ సరికొత్త ఫీచర్ ఫోన్ ధరను కంపెనీ రూ. 1449 గా నిర్ణయించింది. ఈ డివైజ్‌ను మూడు కలర్ లలో కొనుగోలు చేయవచ్చు. ముదురు నీలం, ముదురు బూడిద లేదా లేత ఆకుపచ్చ రంగులో ఈ మొబైల్ కొనుగోలు చేయవచ్చు.

ఐటెల్ పవర్ 450 స్పెసిఫికేషన్స్

ఈ ఫీచర్ ఫోన్‌లో 2.4 అంగుళాల QVGA (320 x 240 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. ఈ మొబైల్ లో MediaTek MTK6261D ప్రాసెసర్‌ అందించనుంది. వీటితో పాటు 8 GB RAM, 32 GB స్టోరేజ్ అందుబాటులో ఉంది. 2500 mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. అలాగే వైర్‌లెస్ ఎఫ్ఎం, వాయిస్ స్పీచ్ టు టెక్స్ట్ యాప్ (హిందీ మరియు ఇంగ్లీష్ సపోర్ట్), 3.5 mm హెడ్‌ఫోన్ జాక్, డిజిటల్ కెమెరా ఉన్నాయి.

9 భాషలు మద్దతు

ఈ ఫీచర్ ఫోన్ ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, తెలుగు, బెంగాలీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం వంటి 9 భారతీయ భాషలలో సేవలను అందిస్తుంది. అంటే మీరు ఈ ఫీచర్ ఫోన్‌ని మీకు ఇష్టమైన భాషలో ఉపయోగించగలరు.

Advertisement

Next Story

Most Viewed