మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారో ఇలా తెలుసుకోండి!

by Jakkula Samataha |
మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారో ఇలా తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ వ్యక్తికి ఆధార్ అనేది తప్పని సరి. ఏ చిన్న పని జరగాలన్నా, సంక్షేమ పథకాల ప్రయోజనం పొందాలన్నా ఆధార్ కావాల్సిందే. అలాంటి ఆధార్ కార్డు ద్వారా కూడా మోసాలు పెరిగిపోయాయి. అందువలన ఎప్పటికప్పుడు ఆధార్ హిస్టరీ చెక్ చేసుకోవాలి అంటున్నారు అధికారులు. అయితే ఆధార్ హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు,అలాంటి వారి కోసమే ఈ సమాచారం.

UIDAI ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ హిస్టరీని చెక్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు మొదట ఎక్కడ ఉపయోగించారు, దీనికి ఏఏ డాక్యుమెంట్స్ లింకై ఉన్నాయో తెలుసుకోవచ్చు.కాగా, ఆధార్ కార్డు హిస్టరీ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఆధార్ uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, My Aadhar ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత Aadhaar Services ఆప్షన్ కింద, Aadhaar Authentication History కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి. సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్ చేసి సెండ్ OTPపై క్లిక్ చేయండి.ఇలా ఈజీగా మీ ఆధార్ కార్డు హిస్టరీని ఓపెన్ చేసి చూసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed