- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Suvega moped: తిరుపతి యువతకు ఎవర్ గ్రీన్ ‘సువేగా’ మోపెడ్
దిశ ప్రతినిధి, తిరుపతి : తిరుపతి జిల్లాలో మిగిలిన ఏకైక వాహనం ఇది. నాలుగున్నర దశాబ్దాలుగా ఈ సువేగా బైక్ (Suvega moped) ఉమ్మడి చిత్తూరు జిల్లావాసులకు సుపరిచితమే. నేటి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ద్విచక్ర వాహనాలతో పోటీ పడుతూ తిరుగుతున్న ఈ సువేగా మోటర్ సైకిల్ గురించి నేటి యువతరానికి తెలియదు. అసలు ఈ సువేగా మోపెడ్ ఎప్పుడు, ఎక్కడ తయారు అయింది..? తిరుపతిలోనే ఎందుకు ఉందో తెలుసుకుందాం.
1980 దశకంలో సువేగా వాహనం తెలియని వారు ఉండరు. తిరుపతికి సమీపంలో రేణిగుంట రోడ్డులో ప్రస్తుతం కృష్ణ తేజ కాలేజ్ ఉన్న సముదాయమే ఒకప్పటి మోపెడ్స్ కంపెనీ. ద్విచక్ర వాహనాలకు ప్రసిద్ధిగాంచిన ఈ మోపెడ్స్ కంపెనీలో తయారైన ఓ మోడల్ వాహనమే సువేగా. పేరుకు తగ్గట్టుగానే సువేగంతో ఆ రోజుల్లో దూసుకుపోయేది ఈ బండి. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేసి రిటైర్ అయిన 84 ఏళ్ల ఎం.గోవిందరాజు 45 సంవత్సరాల నుండి ఈ మోపెడ్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి వీధుల్లో ఈ సువేగా పై రయ్.. రయ్.. మంటూ తిరుగుతున్నారు. 1980లో 5,600 రూపాయలు చెల్లించి ఈ వాహనాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. ఈ వాహనానికి శాశ్వత మెకానిక్ తిరుపతి జబ్బర్ లేఔట్@ నవాపేటలో ఉన్న 74 ఏళ్ల కోదండం. ఏది ఏమైనా పాతకాలం బండ్లే.. భలే బండ్లబ్బా...!