ఐఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ నోటిఫికేషన్ వస్తుందా ? ఇలా క్లియర్ చేసుకోండి..

by Sumithra |
ఐఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ నోటిఫికేషన్ వస్తుందా ? ఇలా క్లియర్ చేసుకోండి..
X

దిశ, ఫీచర్స్ : మనం వాడే ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ ఏదో ఒక రోజు స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అలాగే ఐఫోన్ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది. అలా స్టోరేజ్ నిండిపోయినప్పుడు iPhone లో తరచుగా స్టోరేజ్ ఫుల్ నోటిఫికేషన్‌లను వస్తూ ఉంటాయి. మీరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే ఈ సమస్యను మీరు త్వరగా ఎదుర్కోవలసి వస్తుంది. అయితే మీ ఐఫోన్‌ లో స్టోరేజ్ ఖాళీగా ఉంచాలనుకుంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి.

మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ప్రతి ఫోటోను, ప్రతి వీడియోను వెతికి డిలీట్ చేయాలంటే చాలా కష్టం. అది అంత సులువు కాదు కూడా, అలా చేయాలంటే చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇలా కాకుండా మీ ఐ ఫోన్ లో స్టోరేజ్ ఫ్రీ కావాలంటే మీకు అవసరం లేని యాప్‌లను, ఫైల్స్ డిలీట్ చేయాలి. అంతే కాదు ఓ ఫీచర్ ద్వారా తమ మొబైల్ స్టోరేజిని ఫ్రీ చేసుకోవచ్చు. మరి ఆ ఫీచర్ ఏంటో తెలుసుకుందాం.

మీ ఐఫోన్ లో స్టోరేజ్ ఫుల్ అయిపోయి నోటిఫికేషన్ వస్తే వారు ఇన్ బిల్డ్ ఫీచర్ ను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ తో మొబైల్ లో ఉన్న అనవసర ఫైల్స్, యాప్స్ ను తొలగించొచ్చు. అదే “Offload Unused Apps” ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా అధిక శ్రమను, ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా తక్కువ సమయంలోనే మీ ఫోన్ లో నిండిన స్టోరేజ్ ను ఫ్రీ చేసుకోవచ్చు. ఈ యాప్ మీ మొబైల్ నుంచి ఫిజికల్ గా కనిపించదు. కానీ క్లౌడ్ స్టోరేజ్ లో మొబైల్ లోని డేటా, మీ ఫైల్స్, ఫోటోస్, వీడియోస్ ఇతర వివరాలు అన్నీ అందులో భద్రంగా సేవ్ అయి ఉంటాయి. మీకు అవసరం అయితే వాటిని మళ్ళీ స్టోరేజ్ చేసుకోవచ్చు.

మీ ఐ ఫోన్ లోని స్టోరేజ్ ఫ్రీ కావడానికి, అనవసర యాప్స్ ను తీసేయడానికి ఇలా చేయండి.

మీ ఐ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లండి.

తరువాత “App Store” ఆప్షన్ సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి.

అప్పుడు మీకు “Offload Unused Apps” అనే ఫీచర్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

మీకు అవసరం లేని యాప్స్ ను ఈ ఫీచర్ ద్వారా త్వరగా డిలీట్ చేసుకోవచ్చు.

యాప్స్ డిలీట్ అయినా అందులో ఉండే ఫైల్స్ మాత్రం క్లౌడ్ స్టోరేజ్ లో భద్రంగా ఉంటాయి.

మీకు అవసరం అయినప్పుడు మళ్ళీ డేటాను తీసుకోవచ్చు.

Advertisement

Next Story