- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైటెక్ టెక్నాలజీతో అటల్ సేతు.. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా..
దిశ, ఫీచర్స్ : ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతును ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. దేశంలో సముద్రం పై నిర్మించిన అతిపొడవైన వంతెన అటల్ సేతు. ఈ వంతెన నిర్మాణానికి అనేక హైటెక్ టెక్నాలజీలను ఉపయోగించారు. ఈ బ్రిడ్జిలో ఉపయోగించిన కొన్ని టెక్నాలజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భూకంపం నిరోధక డిజైన్..
అటల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఐసోలేషన్ బేరింగ్‌లు ఉపయోగించాయి. ఇవి షాక్ అబ్జార్బర్‌లుగా పనిచేస్తాయి. ఈ సాంకేతికత కారణంగా భూకంపం సంభవించినట్లయితే ఈ వంతెన విరిగిపోకుండా కొద్దిగా వణుకుతుంది. ఈ వంతెన రూపకల్పన రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపాలను తట్టుకోగలదు అటల్ సేతును నిర్మించిన ఇంజనీర్లు తెలిపారు.
LED లైటింగ్..
రాత్రివేళల్లో ప్రయాణానికి వీలుగా అటల్ సేతు పై తగిన LED లైటింగ్ ఏర్పాట్లు చేశారు. వీటిని ఉపయోగించడం వల్ల పర్యావరణానికి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.
రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచార ప్రదర్శన..
వంతెనపై ఉన్న ట్రాఫిక్ పరిస్థితులు, చుట్టుపక్కల లేన్‌లలో జరిగే ప్రమాదాల గురించి డ్రైవర్ లకు సమాచారాన్ని అందించడానికి అటల్ సేతులో రియల్ టైమ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేలు ఇన్‌స్టాల్ చేశారు. ఈ డిస్‌ప్లేలు నిర్ణీత దూరంలో ఇన్‌స్టాల్ చేశారు. డ్రైవర్లు ప్రయాణించే సమయంలో వంతెన గురించి తక్షణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
నాయిస్ రిడక్షన్ సిస్టమ్..
అటల్ సేతు పై ట్రాఫిక్, వాహనాల హారన్ల నుండి వచ్చే శబ్దాన్ని తగ్గించడానికి వంతెన పై సైలెన్సర్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బ్రిడ్జిపై శబ్దం తగ్గి డ్రైవింగ్‌లో ఏకాగ్రత చేయవచ్చును.