- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొబైల్ వాడకంలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే.. ?
దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ పెరిగింది. చిన్న పిల్లలను మొదలుకొని ముసలివారి వరకు మొబైల్ వాడకాన్ని పెంచారు. ఒకప్పుడు ఏవైనా వస్తువులను కొనాలంటే మార్కెట్ కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు వస్తువులు ఇంటికే వచ్చేస్తున్నాయి. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా మొబైల్ లో సెర్చ్ చేస్తే చాలు క్షణాల్లో మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. గేమింగ్, ఆన్‌లైన్ షాపింగ్, వినోదం, డిజిటల్ ఆర్థిక లావాదేవీలు ఇలా ప్రతి విషయానికి మొబైల్ ని ఎక్కువగా వినియోగిస్తున్నాం.
ఇంతకీ ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఫోన్ ను తనిఖీ చేస్తారు అన్న విషయాన్ని ఎప్పుడైనా గమనించారా.. ఎంత సేపు మొబైల్ ప్రపంచంలోనే మునిగితేలుతున్నారో తెలుసుకున్నారా అంటే లేదనే సమాధానం వస్తుంది. అయితే చరవాణిని ఒక వ్యక్తి ఎన్ని గంటల సేపు వాడుతున్నారు అన్న విషయాలను గురించిన షాకింగ్ నిజాలను కొన్ని సంస్థలు నివేదికల్లో బయటపెట్టాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక వ్యక్తి రోజుకు సగటున 58 సార్లు మొబైల్ ని చెక్ చేస్తారట. యాప్ ఎనీ అనే సంస్థ చేసిన సర్వేప్రకారం మొబైల్ వాడకంలో భారతదేశం ఎనిమిదో స్థానంలో ఉందట. భారతీయులు రోజుకు 4.9 గంటల పాటు ఫోన్ ను వాడుతున్నారట.
అలాగే అమెరికన్లు మొదటి స్థానంలో ఉన్నారని తర్వాతి స్థానాల్లో చైనా, ఇండోనేషియా దేశాలు ఉన్నాయట. అమెరికన్స్ రోజుకు సుమారు 5 గంటలు మొబైల్ ప్రపంచంలోనే ఉంటున్నారని ఫ్లరీ అనలిటిక్స్ తెలిపింది. చాలా వరకు ఇంట్లో ఉన్నప్పుడే మొబైల్ వాడకం, యాప్‌ల వినియోగం పై ఎక్కువ సమయం గడుపుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ అసూరియన్ తెలిపిన అధ్యయనంలో ఒక వ్యక్తి రోజుకు 96 సార్లు మొబైల్ ని తనిఖీ చేస్తున్నారట.