- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
DeepSeek AI: డీప్‌సీక్ దెబ్బకు అమెరికా ఫసక్.. CHATGPT మొగుడు ఇది!
![DeepSeek AI: డీప్‌సీక్ దెబ్బకు అమెరికా ఫసక్.. CHATGPT మొగుడు ఇది! DeepSeek AI: డీప్‌సీక్ దెబ్బకు అమెరికా ఫసక్.. CHATGPT మొగుడు ఇది!](https://www.dishadaily.com/h-upload/2025/01/29/415964-jpeg-optimizerdeepseek-ai.webp)
దిశ,వెబ్‌డెస్క్: DeepSeek AI: సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యాప్ డీప్ సీక్(DeepSeek) తో వరల్డ్ టెక్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇది యాపిల్ యాప్ స్టోర్ లో టాప్ డౌన్ లోడ్ గా నిలిచి..ఇన్వెస్టర్లను షాక్ కు గురిచేసింది. జనవరి 20న విడుదలైన ఈ యాప్ ముందు ఏఐ లవర్స్ ను ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కూడా దీనిపై స్పందించారు. అమెరికన్ కంపెనీలు పోటీతత్వాన్ని నిలుపుకోవడంపై ఫోకస్ పెట్టడానికి ఇది వేకప్ కాల్ అంటూ అభివర్ణించారు.
డీప్ సీక్ అనేది చాట్ జీపీటీ(CHATGPT) వంటి ఏఐబేస్డ్ చాట్ బాట్. ఇది యూజర్లు అడిగే ప్రశ్నకు సమాధానం చెబుతుంది. డేటాను ఇంటిగ్రేట్ చేస్తూ సమాధానాలు ఇస్తుంది. ఈ టూల్ ఆర్ఐ మోడల్ తో రన్ అవుతుంది. R1 అనేది 670 బిలియన్ పారామీటర్లను కలిగి ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది ఇప్పటి వరకు అతిపెద్ద ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్. మ్యాథ్స్, కోడింగ్, రీజనింగ్ వంటి రంగాల్లో ఇది ఓపెన్ఏఐ తీసుకువచ్చిన చాజ్ జీపీటీ వలే పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇతర చైనా ఏఐ మోడళ్ల వలే డీప్ సీక్ రాజకీయంగా సున్నితమైన అంశాల గురించి సమాధానాలు చెప్పదు. 1989 టియానన్ మెన్ స్వ్కేర్ ఊచకోత వంటి ఘటనల గురించి అడిగితే హెల్ప్ ఫుల్ అండ్ హార్మ్ లెస్ రెస్పాన్స్ లు ఇవ్వడానికి మాత్రమే నన్ను డిజైన్ చేశారు అంటూ చెబుతూ సమాధానం దాటవేస్తుంది.
తక్కవ ధర అనేది దీని ప్రత్యేకతల్లో ఒకటి. డీప్ సీక్(DeepSeek AI) క్రియేటర్లు దీన్ని కేవలం 60లక్షల డాలర్లకు డెవలప్ చేశామని చెబుతున్నారు. ఇది ఓపెన్ఏఐ వంటి అమెరికన్ కంపెనీలు ఖర్చు చేసే దానిలో చాలా తక్కువ. డీప్ సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ ఫెంగ్(Liang Wenfeng) 2022లో అమెరికా చైనాకు చిప్ ల ఎగుమతి నిషేధించే ముందు 50,000 ఎన్విడియా A100 చిప్స్ ను స్టోర్ చేసుకున్నారని సమాచారం. వాటితోపాటు చౌకైన చిప్స్ ను జత చేసి అధిక పనితీరును కొనసాగిస్తూనే ఖర్చులను తగ్గించారు.
ఈ డీప్ సీక్ 2023లో బెజియాంగ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ లియాంగ్ వెన్ ఫెంగ్ స్థాపించారు. హై ఫ్లయర్ అనే హెడ్జ్ ఫండ్ ను కూడా రన్ చేస్తున్నాడు. ఇది క్వాంటిటేటివ్ ట్రేడింగ్ కోసం AIని ఉపయోగిస్తుంది. 2019లో హై ఫ్లయర్ 100 బిలియన్ యువాన్లకు పైగా నిధులు సేకరించిన మొదటి చైనా ఫండ్ గా నిలిచింది. చైనా అమెరికాను అనుకరించకుండా వినూత్నంగా ఉండేందుకు లియాంగ్ నొక్కి చెప్పారు. చైనా ఎప్పటి వలే ఫాలోవర్ గా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
డీప్ సీక్ విజయం అడ్వాన్స్డ్ ఏఐకి ఖరీదైన చిప్స్, అలాగే భారీ బడ్జెట్లు అవసరమనే నమ్మకాన్ని సవాల్ చేస్తోంది. ఇది వరల్డ్ టెక్ మార్కెట్లో అనిశ్చితికి కారణం అయ్యింది. జనవరి 27న ఎన్విడియా స్టాక్ 17శాతం పడిపోయి 600 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయింది. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద సింగిల్ డే లాస్. ఒకప్పుడు అత్యంత విలువైన కంపెనీగా ఉన్న ఎన్వీడియా యాపిల్, మైక్రోసాఫ్ట్ తర్వాత మూడో స్ధానానికి పడిపోయింది.
డీప్ సీక్ ను చైనాలో టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ లో ఒక గొప్ప విజయంగా కొనియాడుతున్నారు. ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ను వదిలి ఏఐ, ఎలక్ట్రిక్ కార్ల వంటి కొత్త టెక్నాలజీల్లో దూసుకుపోతున్న చైనా డీప్ సీక్ విజయం గొప్ప మైలురాయిఅంటూ ప్రభుత్వ మీడియా పొగిడింది. ఇది చైనా టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతొందనడానికి నిదర్శనమని పేర్కొంది. చైనాప్రభుత్వం ఇంకా దీనిపై పదవి విప్పలేదు. డీప్ సీక్ ను మాత్రం ప్రపంచ టెక్నాలజీ రంగంలో చైనానే నెంబర్ వన్ అని నిరూపించే ఒక సంకేతంగా భావిస్తున్నారు. ఇది వరల్డ్ టెక్ లీడర్ గా ఎదగాలనే చైనా కలను నిజం చేస్తుందని నమ్ముతున్నారు.