- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదిరిపోయే ఫీచర్స్‌తో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసిన ‘Boat’
దిశ, వెబ్‌డెస్క్: Boat కంపెనీ నుంచి కొత్తగా స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. దీని పేరు ‘Boat Storm Connect Plus’. ఇది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 1,999. యాక్టివ్ బ్లాక్, యాక్టివ్ బ్లూ, కూల్ గ్రే, మెరూన్ అనే నాలుగు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. స్మార్ట్‌వాచ్ 1.91-అంగుళాల డిస్‌ప్లే 550 నిట్స్ గరిష్ట ప్రకాశం, 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 2.5D కర్వ్డ్ గ్లాస్‌తో వస్తుంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా డైరెక్ట్‌గా ఫోన్ కాల్స్ చేయడంతో పాటు, ఆన్సర్ చేయవచ్చు. బయట నుంచి ఎలాంటి సౌండ్స్ డిస్టబెన్స్ లేకుండా నాయిస్-ఫ్రీ కాలింగ్‌ను అందించారు.
Boat Storm Connect Plus స్మార్ట్‌వాచ్ 300mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఇది SpO2 మానిటర్, హార్ట్‌బీట్ ట్రాకర్ వంటి హెల్త్ మానిటరీంగ్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. అలాగే 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్ చేయబడింది. ఇంకా అలారం, కౌంట్‌డౌన్ టైమర్, స్టాప్‌వాచ్, SMS నోటిఫికేషన్, సోషల్ మీడియా, యాప్‌లు, మ్యూజిక్, కెమెరా కంట్రోల్, వాతావరణ అప్‌డేట్‌లు మొదలగు ఫీచర్స్ ఉన్నాయి.