- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరిక

దిశ, టెక్నాలజీ: సాధారణంగా మొబైల్‌ఫోన్ నీళ్లలో పడిపోతే చాలామంది మొదట చేసే పని, ఇంట్లో బియ్యం ఉన్న సంచీలో ఉంచడం. ఫోన్‌లోకి వెళ్లిన నీరు పోవడానికి అందరూ ఇదేవిధంగా చేస్తారు. అయితే, ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ నీళ్లలో పడిన ఫోన్‌ను బియ్యంలో ఉంచితే దెబ్బతింటుందని హెచ్చరించింది. తడిసిన ఫోన్‌ను బియ్యంలో ఉంచడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు ఫోన్‌ను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది. అందుకు బదులుగా నీళ్లలో పడిన ఫోన్‌ను కనెక్టర్ ఉన్నవైపును కిందకు ఉంచి నెమ్మదిగా తడి పోయేలాగా తట్టాలని, ఆ తర్వాత పొడి ప్రదేశంలో ఫోన్‌ను ఉంచాలని యాపిల్ సూచించింది. అరగంట తర్వాతే ఫోన్‌ను ఛార్జింగ్ చేయాలని, ఫోన్‌లో ఉండే నీaరు బయటకు వెళ్లేందుకు 30 నిమిషాలు పడుతుందని గుర్తించుకోవాలని వివరించింది. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సి వచ్చినప్పుడు లిక్విడ్ డిటెక్షన్‌ను ఓవర్‌రైడ్ చేసే వీలుంటుందని తెలిపింది. కొత్తగా ఐఫోన్ కొనే వినియోగదారులు ఈ సమస్య గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరంలేదని, ఇప్పుడున్న ఐఫోన్‌లకు 30 నిమిషాల వరకు నీళ్లలో పనిచేసే సామర్థ్యం ఉందని కంపెనీ వెల్లడించింది.