- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గురి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వస్తున్న టెక్నాలజీల కారణంగా చాలా మంది ప్రాణాప్రాయ పరిస్థితుల నుంచి రక్షించుకుంటున్నారు. ముఖ్యంగా యాపిల్ వాచ్‌ల కారణంగా కొంత మంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే మళ్ళీ ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. Apple వాచ్ సిరీస్ 8 పుణ్యామా అని జర్మనీలో ముగ్గురి ప్రాణాలు దక్కాయి. అదేలాగంటే, జర్మనీలో బుండెసౌటోబాన్ 20 అనే రోడ్డులో ముగ్గురు ప్రయాణికులతో వెళ్తున్న కారు ఆకస్మాత్తుగా 20 మీటర్ల లోతున్న కట్టపై నుంచి పడిపోయింది. దీంతో ముగ్గురు వాహనంలో చిక్కుకుని ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు.
అప్పుుడు ముగ్గురిలో యాపిల్ వాచ్ ధరించిన వ్యక్తి నుంచి యాక్సిడెంట్ డిటెక్షన్ ఫీచర్ ఆధారంగా వాచ్ ద్వారా ప్రమాదం జరిగిన లోకేషన్ షేర్ అయింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ చేరుకుని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి, మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు ఒక నివేదిక పేర్కొంది.
ఇటీవల యాపిల్ కంపెనీ కొత్త iOS 16.3.1 అప్‌డేట్‌తో యాక్సిడెంట్ డిటెక్షన్ ఫీచర్‌ను అందించింది. ఇది యాక్సిడెంట్లు జరిగిన సమయాల్లో లోకేషన్ ద్వారా బాధితుల వద్దకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకోవడానికి సహయపడుతుంది.