Amazon Prime Day Sale 2024: Sony లక్ష రూపాయల టీవీ రూ.54 వేలకే.. స్మార్ట్‌టీవీలపై 65% డిస్కౌంట్

by Harish |   ( Updated:2024-07-20 14:28:09.0  )
Amazon Prime Day Sale 2024: Sony లక్ష రూపాయల టీవీ రూ.54 వేలకే.. స్మార్ట్‌టీవీలపై 65% డిస్కౌంట్
X

దిశ, టెక్నాలజీ: రెండు రోజుల పాటు వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందించనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ జులై 20న ప్రారంభమైంది. దీనిలో సాధారణ ధరల కంటే తక్కువ ధరలో వినియోగదారులు తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో పాటు కొనుగోలు సమయంలో బ్యాంక్ కూపన్‌లు, ఇతర ఆఫర్‌లను పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు మొదలగు వాటిని తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. టాప్ కంపెనీలకు చెందిన పలు మోడళ్లపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. Sony , Samsung, LG వంటి అగ్ర బ్రాండ్‌ల నుండి మొదలుకుని పలు కంపెనీల స్మార్ట్‌టీవీలపై దాదాపు 65% వరకు తగ్గింపు పొందవచ్చు.

Samsung 80 cm (32 inches) HD రెడీ స్మార్ట్ LED TV అసలు ధర రూ.19,900 కాగా, సేల్‌లో రూ.15,199 కే లభిస్తుంది. Sony కంపెనీకి చెందిన Bravia 139 cm (55 inches) 4K Ultra HD Smart LED Google TV KD-55X74L టీవీ అసలు ధర రూ.99,900 కాగా ఇది ఈ సేలలో రూ.54,990 కే లభిస్తుంది. Samsung 108 cm (43 inches) D సిరీస్ క్రిస్టల్ 4K వివిడ్ ప్రో అల్ట్రా HD స్మార్ట్ LED TV ధర రూ. 49,900. అయితే ఇప్పుడు ఇది రూ.30,990 కే అందుబాటులో ఉంది.

LG 139 cm (55 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV ని రూ.40,990 కే సొంతం చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో అసలు ధర రూ.71,990. OnePlus 163 cm (65 అంగుళాలు) Google TV ని రూ.64,999 కే కొనుగోలు చేయవచ్చు, దీని అసలు ధర రూ.1.60 లక్షలు. వీటితో పాటు ఇంకా పలు మోడళ్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed