- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు బిగ్ షాక్.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు భారీగా పెంపు!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు షాకిచ్చింది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచింది. ఈ మేరకు అమెజాన్ సపోర్ట్ పేజీలో పేర్కొంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఏకంగా 67 శాతం మేర పెంచగా.. త్రైమాసిక ప్లాన్‌ను సైతం పెంచేసింది. ప్రతినెల, 3 నెలల ప్లాన్‌ల ధరలు చూస్తే ఒక నెల ప్లాన్ రూ.120, 3 నెలల ప్లాన్ ధర రూ.140 పెరిగాయి. ఇప్పటి వరకు ఇది రూ.179 గా ఉండే.. నెలవారీ అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు రూ.299 పెట్టి రీచార్జ్ చేసుకోవాల్సిందే.
మూడు నెలలకు ఉన్న రూ.459 కాస్తా రూ.599కు చేరిపోయింది. కాస్త ఉపశమనం ఏమిటంటే వార్షిక ప్లాన్(రూ. 1,499)లో మాత్రం ఎటువంటి మార్పూ చేయలేదు. తక్షణమే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే, ఇప్పటికే సబ్‌స్క్రైబ్ అయిన వారికి 2024 జనవరి 15 వరకు పాత రేట్లే వర్తిస్తాయి. ఏదైనా కారణంతో రెన్యువల్ ఫెయిల్ అయితే కొత్త ధరకు ప్లాన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాల రీచార్జ్‌లను పెంచుకునే వ్యూహంతో నెలవారీ, మూడు నెలల ప్లాన్లలో మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక ధర రూ.999గా ఉంది.