- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
OLED డిస్‌ప్లేతో ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసిన Acer
దిశ, వెబ్‌డెస్క్: ఏసర్ కంపెనీ కొత్తగా OLED డిస్‌ప్లేతో ల్యాప్‌టాప్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మోడల్ పేరు ‘Acer Swift Go (2023)’. 16GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ.79,990. ఇది ఒకే సిల్వర్ కలర్ ఆప్షన్‌లో ఏసర్ స్టోర్స్, ఏసర్ ఇ-స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ల్యాప్‌టాప్ 14-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 16:10 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటుంది. 13th Gen ఇంటెల్ కోర్ i5-13500H ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. విండోస్ 11 హోమ్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. దీనిలో స్టీరియో స్పీకర్లను అమర్చారు. ఇది 45W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌తో 65Whr బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 30-నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Acer Swift Go (2023) ల్యాప్‌టాప్ బరువు 1.25 కిలోలు. దీనిలో ట్విన్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. దీని ద్వారా ల్యాప్‌టాప్ హీట్ కాకుండా ఉంటుంది. భద్రత పరంగా బయోమెట్రిక్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది.