ఉప్పునీటితో అదిరిపోయే స్టార్ట్ అప్.. వాటర్ లైట్ ప్రత్యేకతలివే!

by Rajesh |   ( Updated:2023-03-29 03:28:04.0  )
ఉప్పునీటితో అదిరిపోయే స్టార్ట్ అప్.. వాటర్ లైట్ ప్రత్యేకతలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: సాల్ట్ వాటర్‌తో కొలంబియన్ రినవెబుల్ ఎనర్జీ ఈ డినా డెవలప్ చేసిన వాటర్ లైట్ ఆకట్టుకుంటుంది. ఈ కొత్త లాంతర్ పవర్, లైట్‌ను అందిస్తుంది. సముద్రం నుంచి న్యాచురల్ పద్ధతుల్లో తయారు చేయడం ఈ లాంతర్ ప్రత్యేకత. ఈ లాంతర్ తయారీకి రెండు కప్పుల సాల్ట్ వాటర్ ని మాత్రమే వినియోగిస్తుండటం గమనార్హం. ఈ లాంతర్ తో 45 రోజుల వరకు క్లీన్ రినవెబుల్ ఎనర్జీని తయారు చేస్తున్నారు.

రియోట్ ఏరియాల్లో నివసించే వారికి ఈ వాటర్ లైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కరెంట్ లేని ప్రదేశాల్లో నివసించే వారికి లైట్ లా మరియు ఆధారపడేలా ఎలక్ట్రిసిటీగా ఇది ఉపయోగపడుతుంది. వాటర్ లైట్ ఎకో ఫ్రెండ్లీతో పాటు100 శాతం రిసైక్లెబుల్, వాటర్ ప్రూఫ్ కావడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎక్కువ రోజులు మన్నిక ఇవ్వడం, స్థిరంగా పని చేయడం ఈ వాటర్ లైట్ ప్రత్యేకత. ఈ వాటర్ లైట్ పూర్వీకుల మనుగడకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ వాటర్ లైట్ కొలంబియన్ వాయు కమ్యూనిటీ పూర్వీకులతో స్ఫూర్తి పొందింది. ఈ కొత్త ఆవిష్కరణ సముద్రంతో అవినాభావ సంబంధం కలిగి ఉంది.

ఈ వాటర్ లైట్ ని కొలంబియా, వెనిజులా దేశంలోని సముద్ర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న రిమోట్ ఏరియాలో గుయాజిరా ద్వీపకల్పంలో నివసించే వారు వినియోగిస్తున్నారు. ఈ వాటర్ లైట్ ఇక్కడ నివసించే వారి ఎకనమిక్ గ్రోత్ కు, మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. వాటర్ లైట్ కనుగొనక ముందు చేపలు పట్టే వారు రాత్రి పూట తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ ప్రాంతంలో నివసించే చిన్నారులు తమ హోం వర్క్ ని ప్రమాదకరమైన క్యాండిల్ లైట్ కింద చేసుకునే వారు. వెలుతురు లేమి కారణంగా కళాకారులు తమ ఆర్డర్ లను సరైన సమయంలో పూర్తి చేసేవారు కాదు. ఇక్కడ నివసించే వారు సెల్ ఫోన్లను ఛార్జింగ్ చేసుకోవడానికి సైతం ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం వాటర్ లైట్ రాకతో వారి జీవితాలు మారిపోయాయి.

సాల్ట్ వాటర్‌తో ఎలక్ట్రసిటీ ఎలా?

ఈ అద్భుతమైన లాంతర్ ఎలక్రోలైట్ యొక్క ఓనిజేషన్ ను వినియోగించుకుంటుంది. ఉప్పునీటిలో ఉండే మెగ్నిషియంను ఇది కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ లాంతర్ ను ప్రత్యేకంగా రూపొందించారు. అయాన్ల బదిలీని విస్తరించడానికి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ను ప్రత్యేకంగా రూపొందించారు. వీటిని శక్తిగా మార్చడానికి సెలైన్ మాధ్యమం నుండి ఉప్పు వంతెన యొక్క ఎలక్ట్రోడ్లు ఉప్పునీటి నుంచి శక్తిని హరించేలా చేస్తాయి.

ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తో ఈ ప్రక్రియ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ చిన్న, శక్తివంతమైన, సర్క్యూట్ ప్రతి లీటర్ నీటికి దాదాపు 500 వాట్లను సేకరిస్తుంది. మంచి నీటితో కాంతి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. సెల్ ఫోన్ కు, లైట్ ఛార్జ్ సరఫరా చేయడానికి లేదా రేడియో వినడానికి విద్యుత్ వనరు అవసరమైన గ్రిడ్ కమ్యూనిటీలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది రిక్రియేషన్ పరిశ్రమకు, రిమోట్ లోకేషన్స్ లో క్యాంపెయిన్ చేసే వారికి ఎంతగానో యూజ్ అవుతుంది. ఆరుబయట పురుషులు లేదా మహిళలు కంప్యూటర్ లేదా టెలివిజన్ వినియోగించడంలో తోడ్పాటు అందిస్తుంది. ఉప్పునీరుతో చేసిన ఈ ఆవిష్కరణ అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.




Advertisement

Next Story

Most Viewed