కుక్కలతో ఆడుకున్న రోబోటిక్ డాగ్.. వాటి స్థానం కూడా భర్తీ చేయనున్న రోబోట్‌‌లు!(వీడియో)

by Harish |   ( Updated:2024-03-21 12:14:04.0  )
కుక్కలతో ఆడుకున్న రోబోటిక్ డాగ్.. వాటి స్థానం కూడా భర్తీ చేయనున్న రోబోట్‌‌లు!(వీడియో)
X

దిశ, టెక్నాలజీ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోబోలు మన జీవితంలో అంతర్భాగంగా మారుతున్నాయి. కొత్త సాంకేతికతతో వివిధ పరిశ్రమల్లో రోబోల వినియోగం పెరిగిపోయింది. 10 మంది మనుషులు చేసే పనిని ఒక్క రోబో చేస్తుంది. దీంతో ఖర్చు తక్కువ, లాభదాయకత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో రోబోల గురించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్‌లో ఒక రోబోటిక్ డాగ్ కుక్కలతో ఆడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం, ఒక వీధి కుక్క రోబోట్ దగ్గరికి రాగా, అది అటు, ఇటూ కదులుతూ ఉంది. దాని చుట్టూ మరిన్ని కుక్కలు చేరడంతో ఆ రోబోటిక్ డాగ్ వాటితో ఆడుకుంటున్నట్లుగా తిరిగింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో యూజర్లు పలు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్, భవిష్యత్తులో కుక్కల స్థానాన్ని ఇవి భర్తీ చేస్తాయని, వాటి ఉద్యోగాలను కూడా AI రోబోట్‌లు తీసుకుంటాయని వ్యాఖ్యానించారు. మరో యూజర్ రోబోటిక్స్‌లో భారతదేశం సాధించిన పురోగతిని ప్రశంసించారు. ఈ రోబోటిక్ డాగ్‌ను ముక్స్ రోబోటిక్స్ తయారు చేసింది. IIT కాన్పూర్ 'టెక్కృతి' ఫెస్ట్‌లో భాగంగా ప్రదర్శించారు.

Advertisement

Next Story

Most Viewed