- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WhatsApp : వాట్సాప్ యాప్ లో సరికొత్త ఫీచర్
దిశ, వెబ్ డెస్క్ : వాట్సాప్(WhatsApp) యాప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్(new feature) అందుబాటులోకి రానుంది. యూజర్ల వ్యక్తిగత ప్రైవసీకి ప్రాధాన్యతనిస్తూ ‘మెన్షన్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఈ మెన్షన్ ఫీచర్ ఏమిటీ..ఎందుకు పనికి వస్తుందన్న వివరాలపై నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. వాట్సాప్‌లో తీసుకొచ్చిన ‘మెన్షన్’ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ ట్యాగ్ విధానాన్ని కొంత మేరకు తలపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లో మనం ఏదైనా స్టోరీ అప్‌లోడ్ చేసిన సమయంలో నచ్చిన వ్యక్తులకు ట్యాగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ‘@’ సింబల్‌తో ఇలా మీకు నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేసుకుంటారు. తద్వారా ఆవతలి వాళ్లకు మన స్టోరీ కనిపిస్తుంది.
వాట్సాప్ లో తీసుకొచ్చిన ‘మెన్షన్’ ఫీచర్ తో యూజర్లు స్టేటస్ పోస్ట్ చేసే సమయంలో కాంటాక్ట్‌లోని నచ్చిన వ్యక్తులకు ట్యాగ్ చేయొచ్చు. స్టేటస్ అప్‌లోడ్ చేసే సమయంలో ‘యాడ్ క్యాప్షన్ అనే’ బార్‌కు కుడివైపున ‘@’ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే వాట్సప్‌లోని కాంటాక్ట్స్ కనిపిస్తాయి. వీటిలో యూజర్లు నచ్చిన వ్యక్తులను సెలక్ట్ చేసుకోవచ్చు. దీంతో స్టేటస్ అప్‌లోడ్ చేయగానే వాళ్లకు నోటిఫికేషన్ వెళ్తుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో లాగా యూజర్లు ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించనందునా యూజర్ల ప్రైవసీకి ఎలాంటి నష్టం ఉండదు.