Chat GPT సాయంతో వివాహం.. AI పుణ్యమాని ఒక్కటైన జంట..

by Sumithra |
Chat GPT సాయంతో వివాహం.. AI పుణ్యమాని ఒక్కటైన జంట..
X

దిశ, ఫీచర్స్ : మానవ ప్రపంచంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించగానే ప్రజల్లో ఏదో ఆందోళన. కానీ ఇప్పుడు ఏఐ సహాయంతో ప్రజలు తమ జీవితాలను సులభతరం చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిరంతరం చర్చల్లో ఉంది. ఏఐ రాకతో మనుషుల శ్రమ సగానికి సగం తగ్గిపోయింది. ఓవరాల్‌గా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి కష్టమూ తేలికగా మారుతుందేమో అనిపిస్తుంది. అయితే చాలా మంది అనుభవజ్ఞులు AI దుర్వినియోగం అవుతుందేమో అని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. రష్యాలో జరిగిన ఈ సంఘటనలో ఒక అబ్బాయి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాట్‌జిపిటిని ఉపయోగించినట్లు పేర్కొన్నాడు. AI ద్వారా తాను భార్యను ఎంచుకున్నట్లు తెలిపారు. అదేంటి ఏఐతో ఇలా కూడా చేయొచ్చా అనుకుంటున్నారా. పూర్తివివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రష్యన్ వార్తా సంస్థ RIA నోవోస్టి ప్రకారం 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్ అలెగ్జాండర్ జాడాన్ Tinder వంటి డేటింగ్ యాప్‌లలో ChatGPT, అనేక ఇతర AI బాట్‌లను ఉపయోగించాడట. దాని ద్వారా అతను తనకు ఉన్న క్వాలిటీస్ తో ఉన్న అమ్మాయిని వెతకగలిగాడట.

AI ఈ పనిని సులభతరం చేసిందా ?

రష్యన్ మీడియాతో జడాన్ మాట్లాడుతూ ఏఐ సహాయంతో తనకు వచ్చిన ప్రపోసల్స్ లో మొదట 500 మందికి పైగా అమ్మాయిలను షార్ట్‌లిస్ట్ చేశారని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ ఫిల్టర్ చేసి 50 మంది బాలికలను లిస్ట్ నుంచి తీసేశారట. అలా ఫిల్టర్లు చేస్తూ చివరికి కరీనా అనే మహిళను ఎంపిక చేసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నానని తెలిపారు.

ఏఐతో సాయంతో ఎంచుకున్న అమ్మాయిని ముందుగా ఫోన్లో మాట్లాడి తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు పెద్దగా ఇబ్బంది కలగలేదని జడాన్ తెలిపారు. తాను ఆమెతో మాట్లాడిన వెంటనే ఇంప్రెస్ అయ్యా యని వెంటనే తనకు ప్రపోజ్ చేశానని ఇద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed