- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నో సిగ్నల్.. నో రేషన్
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : ఓటీపీ తెచ్చిన కొత్త చిక్కు.. రేషన్కావాలంటే ఓటీపీ తప్పనిసరిగా చెప్పాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. దీంతో అనేక మంది ఆధార్ను మొబైల్నంబర్తో లింక్చేసుకునేందుకు మీ సేవ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అనేక గ్రామాల్లో నెట్వర్క్ సమస్య నెలకొంది. మొబైల్ఉంటే ఏం లాభం నెట్వర్క్లేకుండా ఓటీపీ ఎలా వస్తుందంటూ ప్రజలు వాపోతున్నారు. ఫోన్మాట్లాడాలంటే గుట్టలు, చెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 304 గ్రామాల్లో నెట్వర్క్లేదు. దీంతో రేషన్ఎలా పంపిణీ చేస్తారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇంటర్నెట్, మోబైల్ నెట్వర్క్ సదు పాయం లేని గ్రామా లు రంగారెడ్డి జిల్లాలో అనేకమున్నాయి. కడ్తాల్ మం డలంలోని ఎక్వాయి పల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐరీస్, వెలిముద్రల కోసం ఇప్పటికే చెట్లు, గుట్టలు ఎక్కుతున్నారు. ఈ గ్రామంలోని పొదుపు సంఘాల సభ్యులు తమ లావాదేవీల కోసం ఫోన్లు, ల్యాప్టాప్లు పట్టుకొని సమీపంలోని గుట్టలు ఎక్కి సిగ్నల్ కోసం తాపత్రాయ పడుతున్నారు. కరోనా కాలంలో ఈ గ్రామంలోని ఆన్లైన్ క్లాసుల కోసం విద్యార్థులు ఫోన్లు పట్టుకొని సిగ్నల్కోసం పరుగెత్తిన పరిస్థితులు. ఇలాంటి దుస్థితి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 304 గ్రామాల్లో ఉంది. ఇదే గ్రామంలో 590 కార్డులున్నాయి. నెట్వర్క్ కావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ఆధార్ సెంటర్ల దగ్గర పడిగాపులు..
రేషన్ సరుకులు పొందాలంటే ఆధార్ తో మొబైల్ నెంబ ర్ లింక్ తప్పనిసరి చేయడంతో వికారాబాద్ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఆధార్ సెంట ర్లకు క్యూ కట్టారు. ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఆర్డీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న ఆధార్ సెంటర్ లో రాత్రంతా పడిగాపులు కాస్తున్నారు. రేష న్ రాదన్న భయం ప్రజలను వెంటాడుతోంది. ఆధార్ సెంటర్ దగ్గర అర్ధ రాత్రి చలిలో మంటలు వేసుకుని మరీ జనం పడిగాపులు కాస్తున్నారు. మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే బియ్యం ఇవ్వరేమోననే భయం ప్రజల్లో ఉంది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
లక్ష కార్డులకు నో రేషన్..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని 304 గ్రామాల్లో మొబైల్, నెట్వర్క్ లేకపోవడం తో సుమారుగా లక్ష కార్డులకు రేషన్ అందకపోవచ్చునని అధికారులు గుసగుసలాడుతున్నారు. ఎందుకం టే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలున్నాయి. వృద్దులకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ మొబైల్ లేకపోవచ్చు. మొబైల్ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో ఆధార్ లింక్ ఉన్న మొబైల్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ విధంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో 5,81,000, రంగారెడ్డి జిల్లాలో 5,24,656, వికారాబాద్లో 2,34,940, మేడ్చల్ జిల్లాలో 4,95,000 రేషన్ కార్డులున్నాయి. ఈ రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనతో రిజిస్టర్ మొబైల్ నెం బర్కు ఓటీపీ వస్తోంది. అప్పుడు వేలిముద్ర, ఐరిస్ అథెంటికేషన్ సిస్టమ్ పనిచేయదని అధికారులు వివరిస్తున్నారు.
నెట్ వర్క్ సదుపాయం కల్పించాలి..
మా ఊర్లో మొబైల్ ఉన్నా ఫలితం లేదు. ఊర్లో నెట్వర్క్ లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఓటీపీ ద్వారా రేషన్ ఇస్తామంటున్నారు. అధికారులకు మోర పెట్టుకున్నం. మాకు నెట్వర్క్ కావాలంటే పక్క ఊర్లు ముద్విన్, కర్కల్ పహాడ్ గ్రామాలకు వెళ్లాలి. జంగం ఉమ, ఎక్వాయిపల్లి
ఇప్పటికే అవస్థలు..
మా ఊరిలో 590 కార్డులు ఉన్నాయి. రేషన్ డీలర్ జియో రూటర్ ద్వారా ఇంట్లో మిద్దె మీద, ఊరు బయట సిగ్నల్ వస్తే అక్కడికి వెళ్లి రేషన్ సరుకు లు ఇ స్తారు. ఇక ఓటీపీ కోసం రోజంతా పనిమానేసి రేషన్ షాపు చుట్టూ తిరగాల్సిందే. అన్నెపు అరుణ, ఎక్వాయిపల్లి