కన్నీళ్లు తెప్పిస్తున్న.. ఏఈల సంభాషణ

by Anukaran |   ( Updated:2020-08-23 12:07:11.0  )
కన్నీళ్లు తెప్పిస్తున్న.. ఏఈల సంభాషణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: శ్రీశైలం విద్యుత్ ప్లాంటు ప్రమాద మృతులు చివరి క్షణాల సంభాషణ విన్నవారికి కనీళ్లు వచ్చేలా చేస్తోంది. విద్యుత్ ప్లాంటులో అగ్నిప్రమాదం అనంతరం పొగలో చిక్కుకున్న ఏఈ సుందర్, ఏఈ మోహన్‌ల మధ్య జరిగిన సంభాషణ వీడియో తాజాగా బయటికి వచ్చింది. ఇక తమ పని ముగిసిట్లేనని ఏఈ సుందర్ అన్నారు. అందుకు కొద్ది సేపు ఆలోచించుకొని ఇక అయిపోయినట్లేనని మోహన్ సమాధానమిచ్చారు. ఇక ప్రాణాలపై ఆశలు వద్దని, బతికే పరిస్థితులు లేవని పొగ మొత్తం వ్యాపించిందని సుందర్ అన్నారు. అసలు ఏం జరుగుతుందనేది బయటి ప్రపంచానికి తెలియజేయడానికిగాను వీడియో తీయడానికి వెనుకంజ వేయలేదు. మరణించే ముందు మోహన్ అక్కడి దృశ్యాలను వీడియో తీశారు. అది ప్రస్తుతం బయటికి వచ్చి వైరల్‌గా మారింది.

Advertisement

Next Story