టీం ఇండియా కిట్ స్పాన్సర్‌గా పుమా?

by  |
టీం ఇండియా కిట్ స్పాన్సర్‌గా పుమా?
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా కిట్ స్పాన్సర్ రేసులో జర్మన్ ఫుట్‌వేర్, దుస్తుల కంపెనీ పుమా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత స్పాన్సర్ నైకీ తాము గడువు అనంతరం ఒప్పందాన్ని పొడిగించడానికి సుముఖంగా లేమని తేల్చింది. దీంతో బీసీసీఐ కొత్త కిట్ స్పాన్సర్ కోసం టెండర్లు పిలిచింది. కాగా, ఇప్పటికే పుమా టెండర్ల దరఖాస్తును కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.

దీంతోపాటు ఆడిడాస్ కూడా కిట్ స్పాన్సర్‌షిప్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. గతంలో నాలుగేళ్ల కాల పరిమితికి నైకీ రూ.370కోట్లు (రూ.30కోట్ల రాయల్టీ అదనం) చెల్లించింది. అప్పట్లో ప్రతి మ్యాచ్‌కు రూ.88 లక్షలు నైకీ చెల్లించేది. అయితే, అంత భారీ మొత్తానికి ప్రస్తుత కరోనా సమయంలో ఒప్పందం కొనసాగించలేమని నైకీ చెప్పింది. కొత్త టెండర్లను బీసీసీఐ కూడా తక్కువ ధరకే పిలిచినట్లు సమాచారం. ఈసారి మ్యాచ్‌కు రూ.61లక్షలే బీసీసీఐ ఖరారు చేసింది. మరి ఈ తక్కువ ధరకైనా నైకీ బిడ్ వేస్తుందో లేదో, ఒకవేళ వేసినా బీసీసీఐ ఒప్పుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.


Next Story